STOCKS

News


సెన్సెక్స్‌ కీలక మద్దతుశ్రేణి 37,000-36890

Monday 19th August 2019
Markets_main1566192916.png-27850

వాణిజ్య యుద్ధ ప్రభావంతో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న సంకేతాల్ని బాండ్ల మార్కెట్లు అందించడంతో గతవారంలో అమెరికా స్టాక్‌ సూచీలు పెద్ద పతనాన్ని చవిచూశాయి. దీంతో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌..చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు రాజీ సంకేతాలు పంపారు.  అందుకు చైనా పాజిటివ్‌గా స్పందించకపోయినా, పతనం నుంచి అమెరికా సూచీలతోపాటు ప్రపంచ సూచీలన్నీ కాస్త కోలుకోగలిగాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లకు కష్టకాలం తొలగిపోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మన మార్కెట్‌...కేంద్రం ప్రకటించే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ కోసం ఎదురుచూస్తూ ఆగస్టు తొలివారపు కనిష్టస్థాయిల నుంచి కొంతవరకూ రికవరీ అయ్యింది. రానున్న రోజుల్లో కేంద్రం ప్రకటిస్తుందని భావిస్తున్న పన్ను ఊరటలు, రంగాలవారీగా రాయితీలు మార్కెట్‌ను నిరుత్సాహపరిస్తే, భారత్‌ సూచీల్లో డౌన్‌ట్రెండ్‌ వేగవంతం కావొచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఆగస్టు 16తో ముగిసిన మూడురోజుల ట్రేడింగ్‌ వారంలో తొలిరోజునే గతవారపు గరిష్ట, కనిష్టస్థాయిల్ని బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నమోదుచేసింది. ఆ రోజున 37,755 పాయింట్ల వద్ద ప్రారంభమై, 36,888 పాయింట్ల స్థాయికి పడిపోయింది. అటుతర్వాత మిగిలిన రెండు రోజులు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన సెన్సెక్స్‌ చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 232 పాయింట్ల నష్టంతో 37,350 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 37,000-36,890 పాయింట్ల మద్దతుశ్రేణి కీలకం. ఈ శ్రేణిపై స్థిరపడితేనే రిలీఫ్‌ర్యాలీ జరిగే అవకాశం వుంటుంది. ఈ మద్దతుశ్రేణిని కోల్పోతే 36,650 పాయింట్ల వద్దకు వేగంగా పడిపోవొచ్చు. అటుతర్వాత ఆగస్టు 5నాటి కనిష్టస్థాయి అయిన 36,416 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. పైన ప్రస్తావించిన తొలి మద్దతుశ్రేణిని పరిరక్షించుకున్నా, వారం ప్రారంభంలోనే పెరిగినా సెన్సెక్స్‌ తొలుత 37,480 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే 37,750-37,810 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. కీలకమైన ఈ నిరోధశ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడి 38,170-38,330 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. 

నిఫ్టీ కీలక మద్దతుశ్రేణి 10,930-10,900
క్రితం వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 200 రోజుల చలన సగటు రేఖ (200డీఎంఏ) కదులుతున్న సమీప స్థాయి నుంచి తీవ్రంగా 10,900 పాయింట్ల వద్దకు  క్షీణించిన తర్వాత  కొంతవరకూ నష్టాల్ని పూడ్చుకోగలిగింది.చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 62 పాయింట్ల నష్టంతో 11,048 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 10,930-10,900 పాయింట్ల మద్దతుశ్రేణి కీలకం. గతవారంలో మూడు ట్రేడింగ్‌ రోజుల్లోనూ ఇదే శ్రేణి వద్ద మద్దతు లభించినందున, ఈ శ్రేణిని  కోల్పోతే వేగంగా 10,840 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 10,780 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుశ్రేణిని పరిరక్షిం‍చుకోలిగితే నిఫ్టీ క్రమేపీ 200 డీఎంఏ  కదులుతున్న 11,180 పాయింట్ల వరకూ పెరిగే అవకాశం వుంటుంది. ఈ వారం నిఫ్టీ పెరిగితే తొలుత 11,080 పాయింట్ల స్థాయి నిరోధించవచ్చు. అటుపై 11,180 పాయింట్ల స్థాయి వరకూ పెరగవచ్చు. ఆపైన ముగిస్తే వేగంగా 11,265 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.You may be interested

ఎక్స్‌పెన్స్‌ రేషియో అధికం... ఇన్వెస్ట్‌ చేయాలా ? వద్దా ?

Monday 19th August 2019

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌) ప్ర: పరాగ్‌ పరీక్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ కాకుండా అంతర్జాతీయంగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఇంకా ఏమైనా ఉన్నాయా ?  అసలు మన ఫండ్స్‌కు విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే అవకాశం, అనుమతులు ఉన్నాయా ? విదేశీ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌కు సంబంధించి పన్ను నియమాలు ఎలా ఉంటాయి? ఈ పరాగ్‌ ఫండ్‌కు సంబంధించిన డైరెక్ట్‌ ప్లాన్‌ ఎక్స్‌పెన్స్‌ రేషియో

లాభాల్లో బ్యాంకింగ్‌ షేర్లు

Monday 19th August 2019

అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుం‍డడంతో సోమవారం దేశియ మార్కెట్లు కూడా లాభాల్లో కదులుతుఆన్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 10.52 సమయానికి 223.25 పాయింట్లు లాభపడి 28464.25  పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.13 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.16 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.62 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)

Most from this category