News


సెన్సెక్స్‌ కీలక అవరోధం 37,810

Monday 16th September 2019
Markets_main1568605924.png-28386

అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం ముగుస్తున్న సంకేతాలు కన్పించడం, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ తాజా ఉద్దీపన ప్రకటించడం, వచ్చేవారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ కూడా ఇదేబాటలో పయనించవచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లన్నీ బలంగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా వారాల తర్వాత విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు క్రితంవారం నికర కొనుగోళ్లు జరిపారు. అయితే దేశ జీడీపీ వృద్ధి, కార్పొరేట్ల ఫలితాల పట్ల ఇన్వెస్టర్ల ఆందోళన కారణంగా భారత్‌ మార్కెట్‌ కనిష్టస్థాయిలోనే హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ వారంలో జరగబోయే ఫెడ్‌ మీటింగ్‌, జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం సమీప మార్కెట్‌ ట్రెండ్‌కు ముఖ్యమైనవి.  ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
 సెప్టెంబర్‌ 13తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో 36,784-37,435 పాయింట్ల శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌  చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 403 పాయింట్ల లాభంతో 37,385 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్లో రికవరీ కొనసాగితే సెన్సెక్స్‌ తొలుత 37,730 పాయింట్ల వద్ద అవరోధాన్ని చవిచూడవచ్చు. ఈ స్థాయిని దాటితే వేగంగా 37,810 పాయింట్ల కీలక అవరోధస్థాయిని అందుకోవొచ్చు. ఆరువారాల గరిష్టస్థాయి అయిన ఈ స్థాయిపైన స్థిరపడితే సెన్సెక్స్‌లో ఒడిదుడుకులు తగ్గి, క్రమేపీ 37,950-38,050 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా సెన్సెక్స్‌కు 37,180 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే 37,000 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే తిరిగి 36,780 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. 

నిఫ్టీ కీలక నిరోధం 11,180
 క్రితం వారం ప్రధమార్థంలో 10,890 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో కోలుకుని 11,084 పాయింట్ల వరకూ పెరిగింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 130 పాయింట్ల లాభంతో 11,076 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీ పెరిగితే 11,140 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం కలగవచ్చు. ఈ స్థాయిని దాటితే 11,180 పాయింట్ల వద్దకు చేరవచ్చు. నిఫ్టీ అప్‌ట్రెండ్‌లోకి మళ్లాలంటే ఈ నిరోధస్థాయి కీలకమైనది. ఈ స్థాయిని దాటితే క్రమేపీ 11,270-11,310 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా మొదలైనా 10,980 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున వేగంగా 10,945 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే తిరిగి 10,890 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.  You may be interested

ఎథికల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా..?

Monday 16th September 2019

ధీరేంద్ర కుమార్‌ వ్యాల్యూ రీసెర్చ్‌, సీఈవో ప్ర: ఎథికల్‌ ఫండ్స్‌ అంటే ఏమిటి? మన మార్కెట్లో ఈ ఫండ్స్‌ ఉన్నాయా ? ఈ ఫండ్స్‌లో సామాన్య ఇన్వెస్టర్‌ ఇన్వెస్ట్‌ చేయవచ్చా ? -శైలేంద్ర కుమార్‌, హైదరాబాద్‌  జ: ఎథికల్‌ ఫండ్స్‌... ఆసక్తిదాయకమైనవే. అయితే భారత్‌లో వీటికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ ఫండ్స్‌కు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పెరుగుతోంది. ఆల్కహాల్‌, పొగాకు, తదితర  నైతికం కాని వస్తువులకు సంబంధించిన కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయని ఫండ్స్‌ను

ప్యాకేజీ జోష్‌..!

Monday 16th September 2019

ఎగుమతులు, హౌసింగ్‌ రంగానికి ప్రభుత్వ ఉద్దీపన చర్యలు మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడనుందని అంచనాలు ఇతర ఆర్థికాంశాలపై మార్కెట్‌ వర్గాల దృష్టి సోమవారం టోకు ధరల ద్రవ్యోల్బణ డేటా వెల్లడి ఎఫ్‌ఓఎంసీ సమావేశం ఈవారంలోనే.. శుక్రవారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజాగా మూడో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించారు. జీడీపీ వృద్ధిలో అత్యంత కీలకమైన ఎగుమతులు పుంజుకునేందుకు, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జోష్‌ నింపడం

Most from this category