News


సెన్సెక్స్‌ 37,050 స్థాయిని అధిగమిస్తే..

Monday 26th August 2019
Markets_main1566791829.png-28003

శుక్రవారం మన మార్కెట్‌ ముగిసిన తర్వాత దేశీయంగా ఇన్వెస్టర్లు ఆశిస్తున్న సానుకూల ప్రకటన ఆర్థిక మంత్రి నుంచి వెలువడగా, అంతర్జాతీయంగా అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ మహోధృతరూపం దాల్చింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయపు పన్ను సర్‌ఛార్జ్‌ ఉపసంహరణ, వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, రుణాల్ని చౌకగా లభింపచేయడం, ఆటోమొబైల్‌ రంగానికి రాయితీలు వంటి చర్యలన్నీ ఇన్వెస్టర్లకు రుచించేవే. అయితే అమెరికా ఉత్పత్తులపై చైనా టారీఫ్‌లు వేయడం, వెనువెంటనే చైనా నుంచి అమెరికా కంపెనీల్ని వెనక్కురమ్మంటూ ట్రంప్‌ పిలుపునివ్వడం, చైనా ఉత్పత్తులపై టారీఫ్‌ల్ని పెంచడం వంటి ఆయుధాల్ని వాణిజ్యయుద్ధంలో భాగంగా శుక్రవారం రాత్రే ఇరు దేశాలు ప్రయోగించాయి. ఈ పరిణామం ఇన్వెస్టర్లను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసేదే. ఒక వైపు పెద్ద సానుకూలాంశం, మరోవైపు అనూహ్య ప్రతికూలాంశం....ఈ  డైలమాను భారత్‌ మార్కెట్‌ ఎలా స్వీకరిస్తుందో అంచనావేయడం కష్టసాధ్యం.  ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఆగస్టు 23తో ముగిసినవారంలో తొలిరోజున 37,119 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరి రోజున 36,102 పాయింట్ల  కనిష్టస్థాయికి పడిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కొంతవరకూ కోలుకుని, చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 649 పాయింట్ల నష్టంతో 36,701 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం చివరిరోజున మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజి కారణంగా ఈ సోమవారం సెన్సెక్స్‌ గ్యాప్‌అప్‌తో మొదలైతే 37,050 పాయింట్ల వద్ద తొలి నిరోధం కలగవచ్చు. ఈ స్థాయిపైనే సెన్సెక్స్‌ మొదలై, స్థిరపడితే 37,400 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన 37,720 పాయింట్ల వరకూ రిలీఫ్‌ర్యాలీ కొనసాగే అవకాశాలుంటాయి. అంతార్జతీయ పరిణామాల కారణంగా సెన్సెక్స్‌ తొలినిరోధంపైన స్థిరపడలేకపోతే 36,390 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 36,100 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 35,700 పాయింట్ల వరకూ పతనమయ్యే ప్రమాదం వుంటుంది.  

నిఫ్టీ తొలి నిరోధం 10,910
క్రితం వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,147 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి వేగంగా 10,637 పాయింట్ల వద్దకు వేగంగా పతనమయ్యింది.చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 219 పాయింట్ల నష్టంతో 10,829 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే 10,910 పాయింట్ల స్థాయి తొలుత నిరోధించవచ్చు. ఈ స్థాయిపైనే ప్రారంభమై, స్థిరపడితే 11,035 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 11,145 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే అవకాశం వుంటుంది. తొలి నిరోధంపైన నిఫ్టీ స్థిరపడలేకపోతే 10,720 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో కోల్పోతే 10,630 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 10,500 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. You may be interested

ప్యాకేజీతో ఎకానమీకి ఊతం: సీఐఐ

Monday 26th August 2019

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థను స్థిరపర్చగలవని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. బహుళ రంగ, బహుముఖ విధానపరమైన చర్యలతో వృద్ధికి ఊతం లభించగలదని సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్‌ తెలిపారు. అంతర్జాతీయంగా ప్రతికూలతలు, వాణిజ్యపరమైన మందగమనం కారణంగా ప్రపంచ ఎకానమీకి అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటన పరిశ్రమలకు ఊరటనిచ్చేవిగా ఉన్నాయని చెప్పారు. "ద్రవ్య లోటుపై ఒత్తిడి పడకుండా బహుళ రంగాలకు ఊతమిచ్చే

మార్కెట్‌ ర్యాలీ..?

Monday 26th August 2019

ఎఫ్‌పీఐ సర్‌చార్జ్‌ ఉపసంహరణతో మార్కెట్‌కు జోష్‌.. సోమవారం గ్యాప్‌ అప్‌ ఓపినింగ్‌కు అవకాశం.. క్యూ2 జీడీపీ గణాంకాలు శుక్రవారం వెల్లడి ఈవారంలోనే ఆగస్టు సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు వాణిజ్య యుద్ధంపై ఇన్వెస్టర్ల దృష్టి ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారాంతాన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత.. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను మంత్రి

Most from this category