News


సెన్సెక్స్‌ 37,390 దాటితేనే రిలీఫ్‌ర్యాలీ

Monday 5th August 2019
Markets_main1564990993.png-27543

  • పి.సత్యప్రసాద్‌

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ గతవారం వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, భవిష్యత్‌ రేట్లకోతపై అయోమయ సంకేతాల్నినివ్వడంతో పాటు, చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి టారీఫ్‌ పెంపు హెచ్చరికల్ని చేయడంతో...ఇప్పటివరకూ పటిష్టంగా అమెరికా మార్కెట్‌ కూడా క్షీణతను చవిచూసింది. ఇప్పటికే సతమతమవుతున్న యూరప్‌, ఆసియా మార్కెట్లు మరింత కుదేలయ్యాయి. ఇందుకు తోడు కొన్ని బడ్జెట్‌ ప్రతిపాదనలు నొప్పించడంతో భారత్‌ సూచీల్లో క్షీణత అధికంగా వుంది. వరుసగా నాలుగు వారాల్లో భారత్‌ సూచీలు 6.5 శాతం నష్టపోయాయి. మరోవైపు ఇప్పటివరకూ  కార్పొరేట్‌ ఫలితాలు వెల్లడించిన ప్రధాన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ మినహా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ తదితర హెవీవెయిట్‌ షేర్లన్నీ లాభాల స్వీకరణకు లోనవుతున్నాయి. త్వరితంగా మార్కెట్‌ రికవరయ్యే అవకాశం లేదని ఈ హెవీవెయిట్‌ షేర్ల కదలికలు సూచిస్తున్నాయి. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఆగస్టు 2తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రమేపీ తగ్గుతూ, వారంలో చివరిరోజైన శుక్రవారం 36,607 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అదేరోజు కొంతరికవరీ సాధించడంతో చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 568 పాయింట్ల నష్టంతో 37,118పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం ప్రారంభంలో సెన్సెక్స్‌ 37.390 పాయింట్ల స్థాయిని అధిగమించి స్థిరపడితేనే...తదుపరి రిలీఫ్‌ర్యాలీ కొనసాగే అవకాశం వుంటుంది. ఈ తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా  36,600 పాయింట్ల సమీపంలో లభించబోయే తొలి మద్దతును పరిరక్షించుకుంటేనే మార్కెట్‌కు కొంత స్థిరత్వం వచ్చే అవకాశం వుంటుంది. తొలి నిరోధాన్ని అధిగమిస్తే తదుపరి అవరోధస్థాయిలు 37,580, 37,950 పాయింట్లు. తొలి మద్దతును కోల్పోతే వేగంగా 36,450 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 36,000 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. 

నిఫ్టీ కీలక మద్దతు 10,805
క్రితం వారం 11,310 పాయింట్ల వద్ద ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వేగంగా తగ్గుతూ 10,849 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. గత శుక్రవారం మధ్యాహ్న సెషన్‌ తర్వాత కొంతవరకూ కోలుకుని,  చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 287 పాయింట్ల నష్టంతో 10,997 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం చివరి రెండు రోజులూ నిరోధించిన 11,080 పాయింట్ల స్థాయిని అధిగమిస్తేనే రిలీఫ్‌ర్యాలీ సాధ్యపడి, తదుపరి పెరుగుదల జరుగుతుంది. ఆ సందర్భంలో 200 రోజుల చలన సగటు కదులుతున్న 11,155 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై 11,270 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైనా  తొలుత 11,850 పాయింట్ల సమీపంలో మద్దతు లభించవచ్చు. ఈ లోపున వేగంగా 10,805 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తున్నది. ఇది గతేడాది అక్టోబర్‌- ఈ ఏడాది జూన్‌ మధ్యలో జరిగిన నిఫ్టీ ర్యాలీకి ఇది 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి. ఈ స్థాయిని సైతం వదులుకుంటే క్రమేపీ 10,620 పాయింట్ల వరకూ పడిపోవొచ్చు. 
​​​​​​​You may be interested

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 5th August 2019

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా    కొనచ్చు బ్రోకరేజ్‌ సం‍స్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.105 టార్గెట్‌ ధర: రూ.140 ఎందుకంటే: ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ల విలీనాంతరం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడించిన ఫలితాలు ఇవి. నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పెరిగి రూ.6.498 కోట్లకు పరిమితమైంది. ట్రేడింగ్‌ లాభాలు, ఫీజు ఆదాయం 8

గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్‌ చేయోచ్చా?

Monday 5th August 2019

ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌  ​​​​​​​ ప్ర: గోల్డ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (జీఎఫ్‌ఓఎఫ్‌)లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో నెలకు కొంత మొత్తాన్ని దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆరేళ్ల వయస్సున్న నా చిన్నారికి పెళ్లి కానుకగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఇవ్వాలనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ?  -ఆనంద్‌, హైదరాబాద్‌ : సాధారణంగా పుత్తడిని రెండు మార్గాల్లో కొనుగోలు చేయవచ్చు. ఒకటి ఆభరణాలు/బిస్కెట్ల రూపంలో. మరొక మార్గం గోల్డ్‌ ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌

Most from this category