News


11,100 పైన నిఫ్టీ ముగింపు

Wednesday 31st July 2019
Markets_main1564569402.png-27449

మెటల్‌, ఫార్మా, అటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రెండురోజుల వరుస నష్టాలకు విరామం లభించింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,100 పైన 11,113.80  వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 83.88 పాయింట్లు పెరిగి 37,481.12 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలతో నేడు మార్కెట్‌ నష్టంతో మొదలైంది. ఒకదశంలో అమ్మకాలు తీవ్రతరం కావడంతో నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 10,999 స్థాయికి పతనమైంది. సెన్సెక్స్‌ 269 పాయింట్లను కోల్పోయి 37,128.26 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అనంతరం కనిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు రికవరీని సాధించడంతో పాటు లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో మెటల్‌, ఫార్మా, అటో రంగ కొనుగోళ్ల మద్దతు లభించగా, మీడియా, ఆర్థిక రంగ, రియల్టీరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి(10,999) నుంచి 146 పాయింట్లను ఆర్జించి 11,145.30 వద్ద, సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టం(37,128.26) నుంచి 448 పాయింట్లు పెరిగి 37,576.37 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదుచేసింది. 

ఇన్ప్రాటెల్‌, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 2శాతం నుంచి 5.50శాతం నష్టపోగా, హీరోమోటోకార్ప్‌, ఐఓసీ, యస్‌బ్యాంక్‌, టాటాస్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు 4శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఆటో స్టాకులను ఏం చేద్దాం?

Wednesday 31st July 2019

ఏడాదిలో భారీగా పతనమైన పలు షేర్లు అమ్మకాల్లో క్షీణతే అసలు కారణం ఏడాది కాలంగా దేశీయ ఆటో రంగాల షేర్లు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. లిక్విడిటీ కొరత కారణంగా అమ్మకాలపై నెగిటివ్‌ ప్రభావం పడడం ఆటో షేర్లను కుంగదీస్తోంది. దీనికితోడు నియంత్రణా పరమైన నిబంధనల మార్పులు, రిజిస్ట్రేషన్‌ ధరల పెరుగుదల, మందగమనంలాంటివి ఆటో కంపెనీలను ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో ఏడాదిలో మొత్తం 16 ఆటో, ఆటో అనుబంధ రంగాల కంపెనీల షేర్లు భారీ నష్టాల్లో

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 5 శాతం డౌన్‌...ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్‌ చేతికే వాటా?

Wednesday 31st July 2019

జీ ఎంటర్‌టైన్‌మెట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాన్యం కంపెనీలో కొంతశాతం వాటా విక్రయానికి మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. కంపెనీలో ప్రతిపాదిత వాటా విక్రయానికి రెండు ఆఫర్లు వచ్చాయి. వాటిలో నిర్వహణా వాటా కొనుగోలుకు యూఎస్ కేబుల్‌ దిగ్గజం నుంచి కామ్‌కాస్ట్‌తో పాటు ఫైనాన్షియల్‌ ఫండ్‌ అటైరోస్‌, బ్లాక్‌స్టోన్‌, జేమ్స్‌ మర్దోక్‌కు చెందిన లూపా సిస్టమ్స్‌ కన్సార్షియం నుంచి నాన్‌-బైండింగ్‌ ఆఫర్‌ వచ్చింది. ఈ ఆఫర్‌లో 26 శాతం వాటాను ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలుచేసే

Most from this category