News


మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే!

Thursday 31st October 2019
Markets_main1572518516.png-29265

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ గురువారం (అక్టోబర్‌ 31) సెషన్‌లో తాజా జీవిత కాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. ఈ ఏడాది జూన్‌ నెలలో 40,312 స్థాయి వద్ద ఏర్పరిచిన జీవిత కాల గరిష్ఠాన్ని సెన్సెక్స్‌ ఈ రోజు సెషన్లో అధిగమించింది. ఇంట్రాడే గరిష్ఠామైన 40,344 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని ఏర్పర్చింది. అంతర్జాతీయంగా పాజిటివ్‌ సెంటిమెంట్‌ బలపడడంతోపాటు, కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం‍తో సెప్టెంబర్‌ త్రైమాసికంలో కార్పోరేట్‌ లాభాలు పెరిగాయి. పండుగ సీజన్‌ ప్రభావంతో వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయన్న అంచనాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత పాజిటివ్‌గా మార్చింది. దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు ర్యాలీ చేయడానికి గల ఐదు కారణాలివి..
అంతర్జాతీయంగా సానుకూలత: 
యుఎస్‌ ఫెడరల్‌ రిజర్‌ బ్యాంక్‌ తన పాలసీ సమావేశంలో మరో సారి 25 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేట్లను తగ్గించి, రేట్ల స్థాయిని 2 శాతం నుంచి 1.50-1.75 శాతం స్థాయికి తీసుకొచ్చింది. దీంతో యుఎస్‌ ఫెడ్‌ ఈ ఏడాది వరుసగా మూడవ సారి కూడా వడ్డీ రేట్లను తగ్గించినట్టయ్యింది.  వడ్డీ రేట్లు తగ్గడంతో యుఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ 3 నెలల గరిష్ఠాన్ని తాకింది. యుఎస్‌ ఆర్థిక వ్యవస్థలో వివిధ విభాగాలు బలంగా ఉండడంతో అదనపు కోతలుండవనే సంకేతాలను జెరోమ్‌పొవెల్‌ఇచ్చారు. 

దేశీయంగా పన్ను సంస్కరణలు:
కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో దలాల్‌ స్ట్రీట్‌లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ బలపడింది. అంతేకాకుండా ప్రభుత్వం ఈక్విటీలపై పన్ను రేట్లను మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్న వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచేందుకు, విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచేందుకు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్‌ ఈక్విటీలపై పన్ను రేట్లను సమీక్షించనున్నారని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న దీర్ఘకాల మూలధన లాభాలపై విధించే పన్ను(ఎల్‌టీసీజీ), సెక్యురిటీ లావాదేవి పన్ను(ఎస్‌టీటీ), డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీటీటీ) లను ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖకు చెందిన రెవెన్యు డిపార్ట్‌మెంట్‌తో, నీతీ ఆయోగ్‌తో కలిసి పునః సమిక్షించనుందని ఈ అధికారులు తెలిపారు. 

అంచనాల్ని మించిన కార్పొరేట్‌ ఫలితాలు:
ఆర్థిక మందగమనంతో ఆర్థిక సంవత్సరం 2020 జూన్‌ త్రైమాసికంలో కంపెనీల పనితీరు అధ్వాన్నంగా మారిన విషయం తెలిసిందే. క్యూ1 ప్రభావంతో క్యూ2 ఫలితాలు కూడా అధ్వాన్నంగా ఉంటాయని చాలా వరకు విశ్లేషకులు అంచనావేసినప్పటికి, కార్పోరేట్‌ ఫలితాలు అంచనాలకు మించి బాగుండడం గమనార్హం.‘ ప్రభుత్వం కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో చాలా కంపెనీల సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఫలితంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడింది. వచ్చే త్రైమాసికాలలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే నమ్మకం వచ్చింది’అని సెంట్రమ్‌ బ్రోకింగ్‌, ఈక్విటీస్‌ సీఐఓ అనిల్‌ సరిన్‌ అన్నారు. ‘రియల్‌ ఎస్టేట్‌, పవర్‌, టెలికాం వంటి రంగాల నుంచి ప్రతికూల వార్తలు వెలువడే అవకాశం ఉంది. వీటిని మినహాయిస్తే మొత్తంగా మార్కెట్లో నెగిటివ్‌ సెంటిమెంట్‌ తొలగినట్టే’ అని అన్నారు.

పండుగ సీజన్‌తో ఆటో కళకళ..
ఆర్థిక మందగమనంతో పాటు, తీవ్ర పోటి ఉండడం, బీఎస్‌ 6 నిబంధనలకు మరలుతుండడం వంటి కారణాల వలన ఆటో రంగంలోని షేర్లు కొద్దినెలలుగా పతనమయ్యాయి. ఆటో సెక్టార్‌లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి వలన ప్రస్తుత ధరల వద్ద ఈ స్టాకుల వాల్యుషన్లు ఆకర్షణీయంగా మారాయి. ‘తాజా ట్రెండ్‌ గమనిస్తే ఆటో రంగంలో అధ్వాన్న పరిస్థితి ముగిసినట్టనిపిస్తోంది. పాసింజర్‌ వాహనాలు రికవరి అవుతున్నాయనే సంకేతాలను అక్టోబర్‌ రిటైల్‌ అమ్మకాల ద్వారా వెల్లడవుతోంది. అంతేకాకుండా ద్విచక్రవాహన రంగంలో వృద్ధి బాటమ్‌ ఆవుట్‌ అయినట్లు కనిపిస్తోంది’ అని నోమురా ఓ నివేదికలో పేర్కొంది. ‘వాహనాల హోల్‌ సేల్‌ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన ఈ ఏడాది పండుగ సీజన్‌లో పెరిగాయి. సాధారణంగా పండుగసీజన్‌లో వాహనాల అమ్మకాలు నెలవారి అమ్మకాల సగటు కంటే 1.5 నుంచి 2.0 రెట్లుగా ఉంటుంది’ అని నోమురా తెలిపింది. 

సాంకేతిక కారణాలు:
దేశీయ మార్కెట్‌లు అక్టోబర్‌ నెలలో ఇప్పటికే 4 శాతంకి పైగా ర్యాలీ చేశాయి. షార్ట్‌కవరింగ్‌లు, తాజా కొనుగోళ్లు పెరగడంతో, ఈ ఏడాది జూన్‌లో సెన్సెక్స్‌ ఏర్పాటు చేసిన 40,312 రికార్డు స్థాయిని, గురువారం సెషన్‌లో అధిగమించి 40,344 వద్ద జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. నిఫ్టీ 50 కూడా కొత్త గరిష్ఠానికి 200 పాయింట్ల దూరంలో ఉంది. ఈ స్థాయిని నిఫ్టీ అధిగమిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్‌ నెలకు సంబంధించి నిఫ్టీ రోల్‌ఓవర్స్‌ మూడునెలల సగటు 50.6 శాతం కంటే అధికంగా 53.2 శాతంగా ఉంది. అదేవిధంగా మార్కెట్‌ మొత్తంగా రోల్‌ఓవర్స్‌ మూడు నెలల సగటైన 66.6 శాతాన్ని మించి 69.3 శాతంగా నమోదైంది. ఇది పాజిటివ్‌ సంకేతమని విశ్లేషకులు తెలిపారు. ‘ఆల్‌టైం గరిష్ఠమైన 12,103 స్థాయి వద్ద నిఫ్టీని చూడనున్నాం. ఒకవేళ నిఫ్టీ 11,785 స్థాయికి దిగువన ప్రారంభమైతే, లాభాల స్వీకరణ 11,700-11,650 స్థాయి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ స్థాయి బ్రేక్‌ఔట్‌ జోన్‌గా పనిచేస్తుంది’ అని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ డెరివేటివ్‌ హెడ్‌, శిష్ చతుర్మోహ్తా అన్నారు. 

ఈ అంశాల కారణంగా మార్కెట్‌లో ఐదు రోజులుగా ర్యాలీ సాగుతోంది. You may be interested

వచ్చే ఏడాదే ఆర్థిక రికవరీ: సౌరభ్‌ ముఖర్జియా

Friday 1st November 2019

ఆర్థిక రంగ వృద్ధి బోటమ్‌ అవుట్‌ అయిందన్న సంకేతాలు ఇంకా కనిపించలేదు. కానీ, మార్కెట్లు మాత్రం నూతన గరిష్టాలకు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌ ఈ ఏడాది జూన్‌ 4న నమోదు చేసిన 40,312 స్థాయిని గురువారం ట్రేడింగ్‌లో అధిగమించింది. అయితే, ఆర్థిక రంగ రికవరీ అన్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఇది ఉండొచ్చని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు సౌరభ్‌ముఖర్జీ చెప్పారు.     ‘‘ఆర్థిక రంగ వృద్ధి

సెన్సెక్స్‌ కొత్త రికార్డు... ఐదో రోజూ లాభాలే..

Thursday 31st October 2019

బ్యాంకింగ్‌, ఐటీ, ఫార్మా రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ 5రోజూ లాభంతో ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఆయా రంగాల్లో హెవీవెయిట్‌  షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్ని ఆర్జించాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 340 పాయింట్ల లాభపడి 40,392 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది జూన్‌4నాటి 40,312 పాయింట్ల రికార్డుస్థాయిని తాజాగా అధిగమించడం ద్వారా కొత్త రికార్డును సెన్సెక్స్‌ నెలకొల్పింది. అయితే మరో

Most from this category