News


బుల్‌ దూకుడు- సెన్సెక్స్‌ 430 పాయింట్లు జంప్‌

Wednesday 19th February 2020
Markets_main1582107947.png-31937

సెన్సెక్స్‌ 430 పాయింట్లు ప్లస్‌
140 పాయింట్లు ఎగసిన నిఫ్టీ
ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ జోష్‌
అరబిందో, ఐడియా జోరు

ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌కు హుషారొచ్చింది. దీంతో నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. సెన్సెక్స్‌ 429 పాయింట్లు జంప్‌చేసి 41,323 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 138 పాయింట్లు ఎగసి 12,130 వద్ద ముగిసింది. ఓవైపు ఎంపిక చేసిన రంగాలలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడగా.. మరోపక్క ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో మార్కెట్లు జోరందుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా లాభాల పరుగు తీస్తూనే ఉన్నట్లు తెలియజేశారు. సెన్సెక్స్‌ 41,357 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా.. 41,049 వద్ద కనిష్టానికి చేరింది. ఇక నిఫ్టీ 12,135- 12,042 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.  

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఫార్మా అత్యధికంగా 2.3 శాతం పుంజుకుంది. మీడియా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్‌, రియల్టీ 2-1 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, కోల్‌ ఇండియా, జీ, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ 7-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, టీసీఎస్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 2.2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఐడియా దూకుడు
డెరివేటివ్స్‌లో ఐడియా 40 శాతం దూసుకెళ్లింది. బ్యాంక్‌ గ్యారంటీలను ప్రభుత్వం నగదుగా మార్చుకోకపోవచ్చన్న అంచనాలు దీనికి కారణంకాగా.. అరబిందో 21 శాతం జంప్‌చేసింది. హైదరాబాద్‌ యూనిట్‌-4కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఈఐఆర్‌ను జారీ చేసిందన్న వార్తలు ఇందుకు సహకరించాయి. ఇతర కౌంటర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, ఈక్విటాస్‌, ఎన్‌ఎండీసీ, వోల్టాస్‌, ఆయిల్‌ ఇండియా, సెంచురీ టెక్స్‌, టొరంట్‌ ఫార్మా, సన్‌ టీవీ 7-5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు మదర్‌సన్‌, సెయిల్‌, అపోలో టైర్‌ 1.5-0.5 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.35 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1520 లాభపడగా.. 1009 నష్టాలతో ముగిశాయి.

అమ్మకాల వైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) స్వల్పంగా రూ. 74 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 309 కోట్లు విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. సోమవారం సైతం​ఎఫ్‌పీఐలు రూ. 374 కోట్లు, డీఐఐలు రూ. 154 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ జోరు!

Wednesday 19th February 2020

బుధవారం  బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌0.91త శాతం పెరిగి 30,842.05 వద్ద ముగిసింది. నిఫ్టీ​బ్యాంక్‌ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీలలో ఐడీఎఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 3.77 శాతం పెరిగి 39.90 వద్ద,  ఫెడరల్‌ బ్యాంక్‌ 3.05 పెరిగి 84.35 వద్ద, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 1.54 శాతం పెరిగి 52.80వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.15 శాతం పెరిగి1,227.20 వద్ద, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.01 శాతం పెరిగి 305.10 వద్ద, యాక్సిక్‌ బ్యాంక్‌ 1.07

నెల రోజుల కోసం టాప్‌ సిఫార్సులు

Wednesday 19th February 2020

వచ్చే నాలుగు వారాల్లో మంచి రాబడినిచ్చే మూడు స్టాకులను నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు. 1. డా.రెడ్డీస్‌ ల్యాబ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3380. స్టాప్‌లాస్‌ రూ. 3230. ఏడాదిన్నరగా క్రమానుగత అప్‌మూవ్‌ చూపుతోంది. రూ. 1900 వద్ద మద్దతు జోన్‌ ఏర్పరుచుకుంది. తాజాగా రెండు వారాల కన్సాలిడేషన్‌ నుంచి బ్రేకవుట్‌ చూపింది. దీంతో మరో అప్‌మూవ్‌కు సిద్ధమైన సంకేతాలు ఇస్తోంది. 2. సిప్లా: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 415. స్టాప్‌లాస్‌ రూ. 450.

Most from this category