News


సెన్సెక్స్‌ 500 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు డౌన్‌

Wednesday 25th September 2019
Markets_main1569408940.png-28548

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు లాభాల స్వీకరణ జతకలవడంతో బుధవారం దేశీయ మార్కెట్‌ భారీ నష్టాలతో ముగిసింది. రేపు సెప్టెంబర్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఫలితంగా సెనెక్స్‌ 3రోజుల వరుస లాభాలకు ముగింపు పలుకుతూ 503 పాయింట్ల నష్టంతో 38593.52 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 11450 దిగువున 11,440.20 వద్ద ముగిసింది. ఈ నెలలో నిఫ్టీ సూచీకిది రెండో అతిపెద్ద నష్టం కావడం గమనార్హం. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న మార్కెట్‌ నేడు స్వల్పం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 10 పాయింట్ల నష్టంతో 39,087 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 11,565 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభం నుంచి అమ్మకాలు వెల్లువత్తడంతో సూచీలు పతనం కొనసాగింది.  ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా రంగ షేర్లలో అమ్మకాలు భారీగా జరిగాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయి 29,586.05 వద్ద స్థిరపడింది.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,510.97-39,087.20 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌11,416.10 - 11,564.95 శ్రేణిలో కదలాడింది. 

మారుతి, ఐషర్‌ మోటర్స్‌, యస్‌బ్యాంక్‌, టాటామోటర్స్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 4.50శాతం నుంచి 7.70శాతం వరకు నష్టపోయాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐఓసీ, ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు 1శాతం నుంచి 4శాతం నష్టపోయాయి. 



You may be interested

ఓఎంసీ షేర్ల పట్ల విశ్లేషకుల సానుకూలత

Wednesday 25th September 2019

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీలు) పట్ల అనలిస్టులు సానుకూలంగా ఉన్నారు. ప్రభుత్వరంగంలోని ఏఎంసీలు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ గత నెల రోజుల్లో వాటి కనిష్ట ధరల నుంచి ర్యాలీ చేశాయి. ప్రధానంగా చమురు ధరలు శాంతించడం వీటి ర్యాలీకి దోహదపడింది. వీటిల్లో బీపీసీఎల్‌ బాగా లాభపడింది. నెల క్రితం రూ.321 ధర నుంచి ప్రస్తుతం రూ.465కు చేరింది. ఒకవైపు చమురు ధరల తగ్గుదల, మరోవైపు ఈ కంపెనీలో తనకున్న పెట్టుబడులను

ఇప్పటి ధరల్లో షేర్లు ఆకర్షణీయం కాదు: రాజీవ్‌ ఖన్నా

Wednesday 25th September 2019

-వినియోగ శక్తి పెరిగితేనే ఆర్థిక వ్యవస్థకు మంచిది -అప్పటి వరకు వేచి చూసే దోరణి వైపే మొగ్గు: రాజీవ్‌ ఖన్నా -స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌లలో అవకాశాలు బాగున్నాయి: విజయ్‌ కేడియా -ఆర్‌ఓసీఈని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న కంపెనీల స్టాకులను విడిచిపెట్టోద్దు: అభిషేక్‌ బాసుముల్లిక్‌         దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి వరుస ఆర్థిక చర్యలను ప్రకటించారు. అన్నిటికన్నా ముఖ్యంగా కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించారు. వీటి ఫలితంగా

Most from this category