News


సెన్సెక్స్‌ 2000 పాయింట్లు క్రాష్‌..!

Monday 16th March 2020
Markets_main1584332292.png-32496

  • 9400 దిగువకు నిఫ్టీ

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలు దేశీయ స్టాక్‌మార్కెట్‌ను మరోసారి కాటేశాయి. ఫలితంగా సోమవారం బెంచ్‌మార్క్‌ సూచీలు 4.50శాతం నష్టంతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌  1,520.53 పాయింట్లను కోల్పోయి 32582.95 వద్ద, నిఫ్టీ 440.60 పాయింట్లు నష్టపోయి 9514.60 వద్ద ప్రారంభమయ్యాయి. 

ఇక కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి తీవ్రత రోజురోజూకు మరింత పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 1.50లక్షలకు చేరుకోగా, మొత్తం మృతుల సంఖ్య 5600కు పెరిగింది. ఇక మనదేశంలో కరోనా భాధితుల సంఖ్య 110కి చేరుకుంది. అమెరికాతో పాటు పలు అగ్రదేశాల ప్రభుత్వాలు, కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌ల ముందస్తు చర్చలతో మరోసారి ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం​ ముగింపు స్థాయి(73.91)తో పోలిస్తే 15పైసలు నష్టపోయి 74.06 వద్ద ప్రారంభమైంది. నేడు మార్కెట్‌ ముగింపు అనంతరం ఫిబ్రవరి డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలు కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. 

అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే... అమెరికా  కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షకంటే ముందుగానే వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. దాదాపు వడ్డీ రేట్లులేని(సున్నా) పరిస్థితులు కల్పించడంతోపాటు.. 700 బిలియన్‌ డాలర్ల భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే అమెరికా ఫ్యూచర్లు భారీ నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. 

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 1982.48 పాయింట్ల నష్టంతో 32121.00 వద్ద, నిఫ్టీ 5.77 పాయింట్లను కోల్పోయి 9380.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాలే తప్ప కొనుగోళ్లు లేవు.  అత్యధికంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు భారీగా ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 6.50శాతం నష్టపోయి 23505 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


ఇదే సమయానికి నిఫ్టీ-50 ఇండెక్స్‌లో... ఒక్క యస్‌బ్యాంక్‌(33శాతం లాభం) తప్ప... మిగిలిన అన్ని షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 8.50శాతం నుంచి 12శాతం నష్టాన్ని చవిచూశాయి.  



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Monday 16th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఇండియా బుల్స్‌ హౌసింగ్స్‌: షల్‌ మీడియాలో తమపై వస్తున్న వార్తలు ఆవాస్తవమని, తాము యస్‌ బ్యాంక్‌ నుంచి ఎటువంటి లోన్‌లు తీసుకోలేదని ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌) వెల్లడించింది. మారికో,ఇమామీ: సూపర్‌ వాస్‌మోల్‌ హెయిర్‌ కలర్‌ను రూ.1,500-1,800 కోట్లకు విక్రయించేందుకు  గోద్రేజ్‌ కన్జూమర్‌, మారికో, ఇమామీ, డాబర్‌, హెచ్‌యూల్‌లను సూపర్‌ వాస్‌ముల్‌ మాతృసంస్థ సంప్రదించినట్లు తెలస్తోంది. ఐడీఎఫ్‌సీ: యస్‌బ్యాంక్‌లో పెట్టుబడులు పెట్టేందుకు

అమెరికా వడ్డీ రేట్లు@ జీరో

Monday 16th March 2020

పాలసీ సమీక్షకంటే ముందుగానే వడ్డీ రేట్ల కోత రెండు వారాల్లోనే  రెండోసారి రేట్ల తగ్గింపు ఇంతక్రితం 0.5 శాతం- తాజాగా 1 శాతం సున్నా స్థాయికి చేరిన ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 700 బిలియన్‌ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీ చైనాలో పుట్టి యూరోపియన్ దేశాలను దాటి అమెరికా వరకూ పాకిన కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచం నిలువెల్లా వణుకుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌-19 వైరస్‌ ప్రభావానికి లోనైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక

Most from this category