News


662 పాయింట్లు ఎగిసి... 872 పాయింట్లు వెనుతిరిగి...

Monday 26th August 2019
Markets_main1566796178.png-28018

లాభాలు నిలుపుకోలేని సెన్సెక్స్‌

నిఫ్టీ 244 పాయింట్లు వెనక్కి

దేశీయ మార్కెట్‌ ప్రపంచమార్కెట్ల ప్రభావానికే తలొగ్గింది. ఫలితంగా ఉద్దీపన చర్యల లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలయ్యాయి. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జీని ఉపసంహరించుకోవడం, బ్యాంకులకు రూ.70వేల కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. అంచనాలకు తగ్గట్టుగానే నేడు సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 663 పాయింట్ల లాభంతో 37,364 వద్ద, నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 11,000 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. అయితే అగ్రరాజ్యాల మధ్య మరింత ముదిరిన వాణిజ్య యుద్ధంతో నేడు అసియా మార్కెట్లతో పాటు, యూరప్‌, అమెరికా ఫ్యూచర్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అక్కడ నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో సూచీల ఆరంభ లాభాలన్ని హరించుకుపోయాయి. మెటల్‌, ఐటీ, ఫార్మా, అటో రంగాల షేర్లు అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్ఠం నుంచి 872 పాయింట్లను కోల్పోయి 36,492 వద్ద, నిఫ్టీ 244 పాయింట్లు నష్టపోయి 10,756.55 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. ఉదయం గం.10:20ని.లకు నిఫ్టీ 8పాయింట్ల నష్టంతో 10,821.50 వద్ద, సెన్సెక్స్‌ 40 పాయింట్లను కోల్పోయి 36,750 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
హీరోమోటర్స్‌, హిందాల్కో, వేదాంత, జేఎస్‌డబ్ల్యూస్టీ్‌ల్‌, టాటాస్టీల్‌ షేర్లు, 2.50శాతం నుంచి 6శాతం నష్టపోగా, అదానీపోర్ట్స్‌, బ్రిటానియా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి.You may be interested

మళ్లీ ఆరేళ్ల గరిష్టానికి పసిడి ధర

Monday 26th August 2019

ప్రపంచమార్కెట్లోని పసిడి ధర సోమవారం మళ్లీ ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. వాణిజ్య సుంకాల విధింపు అంశంలో అమెరికా-చైనాలు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరుగుతుంది. ఫలితంగా ఆసియా ట్రేడింగ్లో ఔన్స్‌ పసిడి ధర 27డాలర్లు పెరిగి 1,564.95 స్థాయిని అందుకుంది. పసిడి ధరకు ఇది వరుసగా రెండోరోజూ ర్యాలీ కావడం విశేషం. వాణిజ్య యుద్ధంలో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని ఉత్పత్తులపై డిసెంబర్‌ 15 నుంచి

జైట్లీ.. సంస్కరణల జమాజెట్టీ!

Monday 26th August 2019

- కూలబడ్డ స్థాయి నుంచి పరుగుల దిశగా సంస్కరణలు - జీఎస్‌టీ అమలు చేయటమే అతిపెద్ద విజయం - దివాలా చట్టంతో బ్యాంకులకు ఊరట ఒకపక్క స్కాముల కంపు కొడుతున్న వ్యవస్థ, మరోపక్క దిగజారిన విదేశీ నిధులు!!. ఇటు చూస్తే ద్రవ్య లోటు పెరుగుదల... అటు చూస్తే రెండంకెల ద్రవ్యోల్బణం!!. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎకనమిస్టుకైనా సంస్కరణలు అమలు కత్తిమీద సామే. కానీ ఈ రాజకీయ లాయర్‌కు మాత్రం అది ఒక సంక్లిష్టమైన

Most from this category