News


సెన్సెక్స్‌ 100పాయింట్ల నష్టంతో ప్రారంభం

Friday 21st June 2019
Markets_main1561089742.png-26456

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్‌ దేశీయ మార్కెట్‌ శుక్రవారం స్వల్ప ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 నష్టంతో 39551 వద్ద, నిఫ్టీ 10 పాయిం‍ట్లు క్షీణించి 11821 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రితం ట్రేడింగ్‌లో సూచీలు భారీగా లాభపడిన నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకుంటున్నారు.  కొత్త ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్‌ అధ్యక్షతన నేడు 35వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగున్న నేపధ్యంలో దేశీయంగా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం 31 పైసలు క్షీణించడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. నేడు ఆసియాలో ప్రధాన మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికాకు చెందిన మిలిటరీ డ్రోన్‌ను ఇరాన్‌ సేనలు కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరిగింది. అమెరికా-చైనా దేశాల వాణిజ్య యుద్ధ చర్చల సఫలంపై ఇన్వెస్టర్లకు ఆందోళనలు రేకత్తడంతో ఇందుకు కారణమయ్యాయి. ఫెడ్‌ రిజర్వ్‌ వచ్చే నెలలో వడ్డీరేట్లను తగ్గించవచ్చనే ఆశావహనంతో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అక్కడి ప్రధాన సూచీలైన ఎస్‌అండ్‌పీ రికార్డు స్థాయి వద్ద ముగియగా, నాస్‌డాక్‌ 64 పాయింట్లు, డౌజోన్స్‌ 249 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 132 నష్టంతో 39,468 వద్ద, నిఫ్టీ 30 పాయిం‍ట్లు క్షీణించి 11,801 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. మెటల్‌ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 
బీపీసీఎల్‌, ఐఓసీ, ఇన్ఫ్రాటెల్‌, టాటామోటర్స్‌, మారుతి షేర్లు 1శాతం నుంచి 1.50శాతం నష్టపోగా, కోల్‌ ఇండియా, వేదాంత, హిందాల్కో, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌ షేర్లు 1శాతం నుంచి 3శాతం వరకు లాభపడ్డాయి. You may be interested

31 పైసలు బలహీనపడిన రూపీ

Friday 21st June 2019

డాలర్‌ మారకంలో రూపీ శుక్రవారం(జూన్‌ 21) 31పైసలు బలహీనపడి 69.75వద్ధ ప్రారంభమైం‍ది. దేశియ కారణాలు కాకుండా అంతర్జాతీయ కారణాల వలన రూపీ బలహీన పడింది. వచ్చే వారంలో జరగనున్న జీ20 సమావేశంలో యూఎస్‌-చైనా దేశాల మధ్య చర్చలపై పెట్టుబడిదారులు దృష్ఠి సారించనున్నారు.ఫెడ్‌ వడ్డి రేట్లను యదాతథంగా కొనసాగించినప్పటికి భవిష్యత్‌లో రేట్ల తగ్గింపు​ఉంటుందనే సంకేతాలు ఇవ్వడం, దేశియ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో గురువారం రూపీ  24పైసలు బలపడి రూ.69.44 వద్ద ముగిసింది.

ఐఐఎఫ్‌ఎల్‌ సూచించే 13 స్టాక్స్‌

Friday 21st June 2019

పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకునేందుకు కొందరు ఇన్వె‍స్టర్లు కరెక్షన్‌ కోసం ఎదురు చూస్తుంటారు. నిజానికి మార్కెట్లు కూడా ఇటువంటి అవకాశాలు ఇస్తూనే ఉంటాయి. కానీ, వాటిని గుర్తించేవారు కొందరే. దీర్ఘకాలం కోసం మార్కెట్‌లో ఉండాలనుకునే వారు కరెక్షన్లను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. లార్జ్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడం మంచి ఆప్షన్‌ అవుతుందంటున్నారు.    ‘‘నిఫ్టీ 2019లో 13,000 దిశగా ర్యాలీ చేయనుంది. బలమైన ప్రభుత్వం, సానుకూల

Most from this category