News


మార్కెట్‌ అక్కడక్కడే...

Monday 24th June 2019
Markets_main1561348790.png-26510

దేశీయమార్కెట్‌ సోమవారం స్వల్ప లాభంతో ప్రారంభమైంది. అయితే.., అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సంకేతాలతో తిరిగి నష్టాల్లోకి మళ్లింది. సెన్సెక్స్‌ 30 పాయింట్ల లాభంతో 39,160.23 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి  11,730 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, క్రూడాయిల్‌ ధర పెరుగుదల, ఈ వారంలో జీ-20 సదస్సులో అమెరికా- చైనా దేశాధ్యక్షులు ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంపై చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత.. తదితర అంశాలతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా సూచీలు వరుసగా 2రోజుల పాటు కొత్త రికార్డు అందుకోవడంతో శుక్రవారం ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా అక్కడి సూచీలు స్వల్పంగా నష్టాలతో ముగిశాయి. ఇక దేశీయంగా మార్కెట్ల విషయానికొస్తే... రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) డిప్యూటీ డైరెక్టర్‌ విరాల్‌ ఆచార్య తన పదవికాలం ముగింపునకు ఆరునెలల ముందుగానే రాజీనామా చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. విరాల్‌ ఇందుకు ముందు పనిచేసిన న్యూయార్క్‌ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పనిచేశారు. ఇప్పుడు తిరిగి అదే స్థానంలో ఆగస్ట్‌లో బాధ్యతలు స్వీకరించున్నారు. అలాగే ఈవారంలో జూన్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ముగింపు, బడ్జెట్‌పై ఊహాగానాలతో పాటు రుతుపవనాలు కదలికలపై ఇన్వెస్టర్లు ఇన్వెస్టర్లు దృష్టిని సారించారు.  ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 44 పాయింట్ల నష్టంతో 39,158 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లన కోల్పోయి 11,722.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అటో, మీడియా, రియల్టీ రంగ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. 

టెక్‌ మహీంద్రా, టాటామోటర్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, బజాజ్‌ అటో, హీరోమోటోకార్ప్ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ అండ్‌ టీ, హిందాల్కో, యూపీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.You may be interested

బలహీనపడిన రూపీ

Monday 24th June 2019

డాలర్‌ మారకంలో రూపీ సోమవారం(జూన్‌ 24) 5పైసలు బలహీనపడి 69.60వద్ధ ప్రారంభమైం‍ది. అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ముదురుతున్న ఘర్షణ వాతవరణం కారణంగా సోమవారం ముడి చమురు ధరలు పెరిగాయి. ఫలితంగా రూపీ 5 పైసలు బలహీనపడింది. శుక్రవారం సెషన్‌లో రూపీ 69.55 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.  ఫెడ్‌ వడ్డి రేట్లను భవిష్యత్‌లో తగ్గిస్తుందనే వార్తల నేపథ్యంలో విదేశి పెట్టుబడులు పెరిగడంతో గత వారం రూపీ 21 పైసలు

పెరిగిన క్రూడ్‌ ధరలు

Monday 24th June 2019

పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతలే వలన చమురు ధరలు సోమవారం​ పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.6 శాతం పెరిగి బ్యారెల్‌కు 65.57డాలర్ల వద్ద , డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.8 శాతం పెరిగి 57.86డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇరాన్‌పై ఆంక్షలుంటాయని యూఎస్‌ సెక్రటరి మైక్‌ పాంపో ఆదివారం అనడంతో పాటు డాలర్‌ బలహీనపడడం కూడా ధరలు పెరగడానికి కారణం

Most from this category