News


39000లపైన ప్రారంభమైన సెన్సెక్స్‌

Tuesday 18th June 2019
Markets_main1560830787.png-26361

కిత్రం ట్రేడింగ్‌లో నెల కనిష్టానికి పతనమైన సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభపడి 39000 స్థాయి అందుకుని 39,057 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 11692 వద్ద మొదలయ్యాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపుతో పాటు నేడు ఆసియాలో ఒక్క జపాన్‌ మిగతా అన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ అవుతుండటం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలతో ముడిచమురు ధరలు స్వల్ప చల్లారడం, ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అలాగే, క్రితం రోజు సూచీలు భారీపతనం నేపథ్యంలో అధిక వాల్యూ కలిగిన షేర్లు కనిష్టస్థాయిల్లో ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు మొగ్గుచూపుతున్నారు. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 96.19 పాయింట్ల లాభంతో 39056.98 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 11706 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌, అటో, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. మీడియా, ఎఫ్‌ఎంజీసీ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.

హెచ్‌సీఎల్‌, సిప్లా, వేదాంత, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం లాభపడగా, ఎస్‌బీఐ, టైటాన్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు అరశాతం నుంచి 2శాతం నష్టపోయాయి.



You may be interested

69.83 వద్ద ప్రారంభమైన రూపీ

Tuesday 18th June 2019

డాలర్‌ మారకంలో రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 69.83 వద్ద ప్రారంభమైం‍ది. దేశియ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తడం, ట్రేడ్‌ వార్‌ భయాలు కారణంగా గత సెషన్‌లో 11 పైసాలు కోల్పోయి 69.91 వద్ద ముగిసింది. ఫెడరల్‌ బ్యాం‍క్‌ పాలసీ ప్రకటన ఈ వారంలో వెలువడనున్న  నేపథ్యంలో రూపీ ఒత్తిడికి గురికావచ్చు. సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ వెలువడే ముందు రూపీ తక్కువ రేంజ్‌లో ఏకీకృతం అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఫెడరల్‌

పదేళ్ల కోసం పది స్టాక్స్‌

Monday 17th June 2019

ఈ రోజు చెట్టు నీడలో సేద తీరుతున్నారంటే ఎన్నో ఏళ్ల క్రితం ఎవరో ఒకరు ఆ చెట్టును నాడడం వల్లే కదా... అలాగే, పదేళ్ల క్రితమే స్టాక్స్‌ను కొనుగోలు చేసి ఉంటే, అవి మంచి వ్యాపారాలు, యాజమాన్యాల చేతుల్లో ఉన్నవి అయితే, ఈ పాటికి ఎన్నో రెట్ల ప్రతిఫలం ఇచ్చి ఉండేవి. అలాగే, మరో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం దృష్టితో ఇప్పుడే పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం ఎకనమిక్స్‌

Most from this category