News


12100 పైన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 23rd January 2020
Markets_main1579752419.png-31123

 

  • 76 పాయింట్లు లాభంతో మొదలైన సెన్సెక్స్‌ 
  • కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం స్వల్ప లాభంతో మొదలైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 76 పాయింట్ల లాభంతో 41,191 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 12,123.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఐటీ, ఆర్థిక, అటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ మునుపటి ముగింపు (41,115.38)తో పోలిస్తే 138 పాయింట్లు పెరిగి  41,253.79 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, నిఫ్టీ క్రితం ముగింపు స్థాయి (12,106.90)తో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో 12,137.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 100 పాయింట్లు లాభపడి 30,806.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఏడువారాల కనిష్టానికి దిగిరావడం మార్కెట్‌కు కలిసొచ్చింది. ప్రధాన కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుండటం, వచ్చేవారంలో కేంద్రం 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత వహిస్తున్నారు. 

చైనాలో కరోనా వైరస్‌ ప్రబలుతోందన్న ఆందోళనలతో నేడు ఆసియాలో ప్రధాన మార్కెట్లు నష్టాలో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక బుధవారం అమెరికా స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలో గరిష్టస్థాయిని అందుకున్నప్పటికీ ముగింపు సమయానికి ఫ్లాట్‌గా ముగిశాయి. 

నిఫ్టీ 50 ఇండెక్స్‌లో... బీపీసీఎల్‌, ఇన్ఫోసిస్‌, ఐఓసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు 1శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, యూపిఎల్‌, సిప్లా, ఇన్ఫ్రాటెల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. 



You may be interested

యాక్సిస్‌, ఎల్‌అండ్‌టీకి ఫలితాల జోష్‌

Thursday 23rd January 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ షేర్లు గురువారం పాజిటివ్‌గా దూసుకుపోయాయి. యాక్సిస్‌ బ్యాంకు షేరు రూ. 725 వద్ద ఆరంభమై రూ. 737.55 గరిష్ఠాన్ని తాకి రూ. 730 వద్ద కదలాడుతోంది. గత క్లోజింగ్‌తో పోలిస్తే షేరు దాదాపు 2.5 శాతం లాభపడింది. ఎల్‌అండ్‌టీ షేరు రూ. 1307 వద్ద ఆరంభమై రూ. 1336.90 వద్ద గరిష్ఠాన్ని తాకి ప్రస్తుతం రూ. 1335 వద్ద

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Thursday 23rd January 2020

బయోకాన్‌, కెనరా బ్యాంక్‌, డీబీ కార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, హెచ్‌టీ మీడియా, జేఎం ఫైనాన్షియల్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పీవీఆర్‌ కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

Most from this category