News


300 పాయింట్ల గ్యాప్‌తో సెన్సెక్స్‌ ప్రారంభం

Tuesday 4th February 2020
Markets_main1580788505.png-31486

  • కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం
  • 78 పాయింట్ల లాభంతో మొదలైన నిఫ్టీ 

దేశీయ మార్కెట్‌ మంళవారం లాభంతో మొదలైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 306 పాయింట్ల లాభంతో 40,167.86 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 11,786.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో అంతర్జాతీయ వృద్ధి మందగమన ఆందోళనలతో ప్రపంచమార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ఏకంగా 2శాతం నష్టపోయి 50డాలర్లకి దిగువకు వచ్చింది. ఈ ధరలు 13నెలల కనిష్టస్థాయి గమనార్హం. క్రూడాయిల్‌ పతనం దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. డాలర్‌ మారకంలో రూపాయి 10పైసలు బలపడటం, ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ తదితర అంశాల నుంచి మన మార్కెట్‌ కొంత సానుకూలతలను అందుకుంది. కొత్త ఆర్డర్ల జోరుతో తయారీ రంగం గత నెలలో ఎనిదేళ్ల గరిష్టాన్ని అందుకోవడం మార్కెట్‌కు ఉత్సాహనిచ్చింది
 
ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 287 పాయింట్ల లాభంతో 40,159.42 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు పెరిగి 11,800.15 వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి. రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. అత్యధికంగా మెటల్‌, ఐటీ షేర్లు లాభపడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.60శాతం లాభంతో 30,0202 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

13 నెలల కనిష్టానికి చమురు ధరలు

Tuesday 4th February 2020

బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 4 శాతం పతనం 50 డాలర్ల దిగువకు చేరిన నైమెక్స్‌ క్రూడ్‌ అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు డీలాపడ్డాయి. కరోనా వైరస్‌ కారణంగా చైనా మరింత ఆర్థిక మందగమనంలోకి జారుకోవచ్చన్న అంచనాలు చమురు ధరలను దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనాసహా ఇతర దేశాలలోనూ కరోనా జాడలు కనిపిస్తుండటంతో చమురుకు డిమాండ్‌ పడిపోవచ్చన్న ఆందోళనలు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. లండన్‌ మార్కెట్లో

గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ లాభం 9 శాతం అప్‌

Tuesday 4th February 2020

రూ.517 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో 9 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.42 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.45 కోట్లకు పెరిగిందని గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పిరోజ్‌షా గోద్రేజ్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.431 కోట్ల నుంచి రూ.517 కోట్లకు

Most from this category