News


12100 వద్ద నిఫ్టీ ప్రారంభం

Friday 31st January 2020
Markets_main1580443219.png-31355

బడ్జెట్‌కు ముందురోజు మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 232 పాయింట్ల లాభంతో 41వేల పైన 41,146.56 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల పెరిగి 12100 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధిని చైనా సమర్థవంతంగా ఎదుర్కోంటుందని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో కొంత సానుకూల వాతావరణం నెలకొంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మునుపటి ముగింపు(71.48)తో పోలిస్తే 4పైసలు స్వల్పంగా బలపడి 71.44 వద్ద ప్రారంభమైంది. నిన్నటి రోజు మార్కెట్లో జరిగిన అమ్మకాల నేపథ్యంలో నేడు షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకుంటుంది. కరోనా వైరస్‌ భయాలతో అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలతో క్రూడాయిల్‌ ధర 3నెలల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. కేంద్రం రేపు(ఫిబ్రవరి1న) పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నేడు వెలువడే ఆర్థిక సర్వే గణాంకాలపై దృష్టిని సారించారు. రేపు శనివారం అయినప్పటికీ... స్టాక్‌ మార్కెట్‌ పనిచేస్తుందని ఎక్చ్సేంజీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 133 పాయింట్లు లాభంతో 41,046.96 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 12,072 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.85శాతం లాభపడి 30,904 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

జీ లిమిటెడ్‌, హీరోమోటోకార్ప్‌, ఇండస్‌ ఇండ్‌, బజాజ్‌ అటో, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, విప్రో, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. 



You may be interested

విప్రో సీఈవో రాజీనామా- షేరు వీక్‌

Friday 31st January 2020

వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న నీముచ్‌వాలా సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ సీఈవో అబిదాలీ నీముచ్‌వాలా.. పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో సీఈవో పదవికి నీముచ్‌వాలా రాజీనామా చేసినట్లు విప్రో తాజాగా పేర్కొంది. అయితే కొత్త సీఈవోను ఎంపిక చేసేటంతవరకూ నీముచ్‌వాలా పదవిలో కొనసాగన్నుట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా విప్రోకు ఆయన అందించిన సేవలను కంపెనీ కొనియాడింది. కొత్త సీఈవో ఎంపికకు బోర్డు సన్నాహాలు ప్రారంభించినట్లు కంపెనీ తెలియజేసింది.

పసిడి... డిమాండ్‌ ఢమాల్‌..!

Friday 31st January 2020

భారత్‌లో 9 శాతం తగ్గిన డిమాండ్‌ ప్రపంచ పసిడి మండలి నివేదిక న్యూఢిల్లీ: ధరల తీవ్రతతో భారత్‌లో బంగారం డిమాండ్‌ 2019లో 9 శాతం పడిపోయిందని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది. దేశీయ ఆర్థిక మందగమనం కూడా పసిడి డిమాండ్‌ తగ్గడానికి దారితీసిందని మండలి పేర్కొంది. మండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపిన సమాచారం ప్రకారం- నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... 2018లో దేశంలో బంగారం డిమాండ్‌ 760.4 టన్నులు. 2019లో ఈ

Most from this category