News


11500 పైన ప్రారంభమైన నిఫ్టీ

Tuesday 1st October 2019
Markets_main1569902991.png-28645

జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., మార్కెట్‌ మంగవారం లాభంతో ప్రారంభమైంది. రెండు రోజుల నష్టాల ముగింపునకు స్వస్తి సెన్సెక్స్‌ 150 పాయింట్లు లాభంతో 38,910 వద్ద మొదలైంది. నిఫ్టీ 41 పాయింట్లు 11500పైన 11515 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 123 పాయింట్లు పెరుగుదలతో 29,226.15 వద్ద మొదలైంది. బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ మీడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఐటీ, మెటల్‌, రియల్టీ రంగ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 192 పాయింట్లు లాభంతో 38,859 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 11,544 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ నేపథ్యంలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.50శాతం (426 పాయింట్లు) పెరిగి 29,486.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఐషర్‌మోటర్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 7.50శాతం లాభపడ్డాయి. కోల్‌ ఇండియా ఇన్ఫ్రాటెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. 



You may be interested

70.73 వద్ద రూపీ ప్రారంభం​

Tuesday 1st October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం ట్రేడింగ్‌లో 14 పైసలు బలపడి 70.73 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో చమురు ధరలు తగ్గినప్పటికి, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో రూపీ డాలర్‌ మారకంలో 31 పైసలు బలహీనపడి 70.87 వద్ద ముగిసింది. యూఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనల వలన ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకోడానికి ఇష్టపడడం లేదని విశ్లేషకులు తెలిపారు. దీంతోపాటు గత సెషన్లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ల

52 వారాల గరిష్ఠానికి బీపీసీఎల్‌!

Tuesday 1st October 2019

  బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌) లోని ప్రభుత్వం మొత్తం వాటాను విక్రయించేందుకు సెప్టెంబర్‌ 30న సమావేశమైన డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్యానెల్‌ అంగీకరించడంతో  మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో  బీపీసీఎల్‌ షేరు 8 శాతం లాభపడి రూ. 511.55 వద్ద ఏడాది గరిష్ఠాన్ని తాకింది. దీంతోపాటు గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోవడంతో కూడా ఈ షేరు ర్యాలీ చేస్తోంది. గత సెషన్‌లో రూ.470.10 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం రూ.

Most from this category