News


లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

Friday 30th August 2019
Markets_main1567138245.png-28100

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ శుక్రవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 153 పాయింట్లు లాభంతో 10,987.80 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు లాభంతో 10,987.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు వరుసగా రెండురోజూ లాభాల్లో ముగియడంతో పాటు, నేడు ఆసియాలో పలు ప్రధాన సూచీలు పాజిటివ్‌ ట్రేడ్‌ అవుతుండటం, అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ కొంత మెరుగైంది. నేడు సెప్టెంబర్‌ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్ట్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రేడర్లు కొత్త పొజిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతుండంతో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఉదయం గం.9:30ని.లకు నిఫ్టీ 52.15 పాయింట్ల లాభంతో 11,000.45 వద్ద, సెన్సెక్స్‌ 146.98 పాయింట్లు పెరిగి 37,215.91 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  మెటల్‌, బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ, రియల్టీ, రంగాలకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఫ్లాట్‌గా ప్రారంభమైన నేపథ్యంలో ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల కష్టాల ఎదుర్కోంటున్నాయి.  బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టంతో 27,423.30 వద్ద  కదలాడుతుంది. 
జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, వేదాంత, గెయిల్‌, హిందాల్కో, టాటాస్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం వరకు లాభపడ్డాయి. కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌టెక్‌, టెక్‌మహీంద్రా, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు అరశాతం నుంచి 3శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

చమురుపై హరికేన్‌ ప్రభావం!

Friday 30th August 2019

కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ వృద్ధి, చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరుగుతున్నాయి. ఫలితంగా చమురు ధరలు శుక్రవారం ట్రేడింగ్‌లో(ఉదయం 0050 జీఎంటీ(గ్రీనిచ్‌ మీన్‌ టైం) సమయానికి) తగ్గాయి. యుఎస్‌ చమురు నిల్వలు గత వారం అంచనాల కంటే అధికంగా తగ్గడంతో పాటు హరికేన్‌ ఫ్లోరిడా వైపు కదులుతుండడంతో యుఎస్‌ క్రూడ్‌ ధరలు గత వారం 4 శాతం మేర పెరిగాయి. కాగా శుక్రవారం ట్రేడింగ్‌లో యుఎస్‌ క్రూడ్‌ 0.1 శాతం

71.78 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Friday 30th August 2019

దేశియ రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం 71.78 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. యుఎస్‌ విధించిన సుంకాలకు ప్రతీకారంగా ఇప్పట్లో యుఎస్‌ దిగుమతులపై టారిఫ్‌లను విధించమని గురువారం చైనా అనడంతో ఇరు దేశాల మధ్య ముదురుతున్న వాణిజ్య ఘర్షణ కొంత సరళతరం అయ్యింది. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌మారకంలో 3 పైసలు బలహీనపడి 71.80 ముగిసింది. గత పది రోజుల నుంచి డాలర్‌మారకంలో నష్టపోతున్న చైనా కరెన్సీ యువాన్‌ గురువారం

Most from this category