News


12200పైన నిఫ్టీ ప్రారంభం

Wednesday 22nd January 2020
Markets_main1579666202.png-31090

  • 150 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌
  • కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ అంశాలు

రెండు రోజుల వరుస నష్టాల ముగింపు అనంతరం మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 143 పాయింట్ల లాభంతో 41,467.13 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల పెరిగి 12200పైన 12,203.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం, ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి లాభంతో ప్రారంభం కావడంతో పాటు ఇప్పటికి కంపెనీలు ప్రకటించిన క్యూ3 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్చించడం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహనిచ్చాయి. ఉదయం గం.9:30ని.లకు ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 41,483 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 12,215.10 వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఐటీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అలాగే ఫార్మా, బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు సైతం లాభాల్లో కదలాడుతున్నాయి. మరోపక్క మెటల్‌, మీడియా రంగ షేర్ల మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా నిన్నటి ట్రేడింగ్‌లో 31వేల మార్కును కోల్పోయి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 70 పాయింట్లు లాభపడి 31వేల పైన 31,028.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, వేదాంత షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. జీ లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా షేర్లు 1.50శాతం నుంచి 4శాతం నష్టపోయాయి. 



You may be interested

4 వారాలకు 3 స్టాక్‌ రికమండేషన్స్‌?

Wednesday 22nd January 2020

8-14 శాతం రిటర్న్స్‌ అంచనా సాంకేతిక అంశాల ఆధారంగా సిఫారసులు వరుసగా రెండు రోజులపాటు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీ స్టాక్‌ మార్కెట్లు బుధవారం బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. బడ్జెట్‌పై అంచనాలు పెరగడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్‌ 185 పాయింట్లు ఎగసి 41,510కు చేరగా.. నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 12,218ను తాకింది. పెట్టుబడులు, వినియోగంపై దృష్టిపెడుతూ బడ్జెట్‌ వెలువడనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జీడీపీ వృద్ధికి ఊతమిచ్చే

టెల్కోలకు ఆఖరు అవకాశం

Wednesday 22nd January 2020

పాక్షిక చెల్లింపులైనా చేయాలంటున్న డీఓటీ ఏజీఆర్‌ బకాయిలపై టెల్కోల అభ్యర్ధనను వినేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ లోపు టెలికం శాఖతో చెల్లింపుల విధివిధానాలు, కాలపరిమితి గురించి టెల్కోలు చర్చించాల్సిఉంటుంది. గురువారానికి టెలికం కంపెనీలు టెలికం శాఖకు రూ. 1.02 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సిఉంది. అయితే డెడ్‌లైన్‌ సమయానికి మొత్తం కట్టకున్నా, కొంత మొత్తం చెల్లిస్తే చర్చలకు తాము సిద్ధమని డీఓటీ అధికారులు సంకేతాలు ఇచ్చారు. కోర్టు తీర్పు వచ్చే

Most from this category