News


8000 పైన ప్రారంభమైన నిఫ్టీ

Tuesday 24th March 2020
Markets_main1585023026.png-32650

1259.69 లాభంతో మొదలైన సెన్సెక్స్‌

నిన్నటి ట్రేడింగ్‌లో అతిపెద్ద పతనాన్ని చవిచూసిన దేశీ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీ గ్యాప్‌తో మొదలైంది. సెన్సెక్స్‌ 1259.69 లాభంతో 27240.93 వద్ద, నిఫ్టీ 400.75 పాయింట్లు పెరిగి 8002.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న భారీ పతనం నేపథ్యంలో ట్రేడర్ల షార్ట్‌కవరింగ్‌, నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ అవుతుండటం, డాలర్‌ మారకంలో రూపాయి నిన్నటి ముగింపు( 76.29)తో పోలిస్తే 22పైసల లాభంతో ప్రారంభం కావడం తదితర అంశాలు సూచీల లాభాల ప్రారంభానికి కారణమయ్యాయి. 

ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి ఏలాంటి చర్యలకైన వెనకాడబోమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ ప్రకటనతో నేడు ఆసియా మార్కెట్లు లాభాలబాట పట్టాయి. జపాన్‌, కోస్పీ, తైవాన్‌ దేశాల సూచీలు 5శాతం లాభపడగా, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌, చైనాల దేశాల స్టాక్‌ సూచీలు 3శాతం పెరిగాయి. అయితే నిన్నరాత్రి అమెరికా సూచీలు మాత్రం 3శాతం నష్టంతో ముగియడం గమనార్హం.

మీడియా,  రియల్టీ రంగాలకు చెందిన షేర్లు మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి. అత్యధికంగా ఫార్మా, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. 

ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో...  బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 7.50శాతం నుంచి 10శాతం లాభపడ్డాయి. టాటాస్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌ షేర్లు 0.10శాతం నుంచి 1శాతం నష్టాన్ని చవిచూశాయి. 



You may be interested

బంగారానికి ఫెడ్‌ బూస్టింగ్‌..!

Tuesday 24th March 2020

రెండురోజుల్లో 118 డాలర్ల లాభం దేశీయంగా రూ.1721లు లాభం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెడుతోంది.  కరోనా వైరస్‌ వ్యాధితో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ తిరిగి స్థిరపడేంతవరకు ఎంతంటి చర్యలకైన వెనకాడబోమని అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ హామి ఇవ్వడంతో బంగారం ధర కనిష్ట స్థాయి నుంచి భారీగా రికవరీ అయ్యింది. గడచిన రెండు రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 118 డాలర్లు, దేశీయంగా రూ.1721లు లాభపడింది.  ఫెడ్‌ రిజర్వ్‌

రూపాయికి ‘కోవిడ్‌’ ‍కాటు

Tuesday 24th March 2020

ఒకేరోజు 102 పైసలు పతనం 76.22 వద్ద ముగింపు ఇంట్రాడేలో ఏకంగా 76.30కి బలహీనం ఏ రోజుకారోజు కొత్త కనిష్టాలు... మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ఇదే పరిస్థితి ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్‌ సెషన్‌లోనూ మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి  కిందకుపడిపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఏకంగా 102 పైసలు బలహీనపడి 76.22కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు.  ఇంట్రాడేలో రూపాయి విలువ

Most from this category