News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Tuesday 18th February 2020
Markets_main1581998036.png-31878

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్‌ మంగళవారం మార్కెట్‌ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 139 పాయింట్ల నష్టంతో 41వేల దిగువున 40916.69 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల పతనంతో 12011.8 వద్ద ట్రేడింగ్‌ను ‍ప్రారంభించింది. కరోనావైరస్ వ్యాప్తి భయాలతో ఉత్పత్తి మందగించి, చైనాలో డిమాండ్ బలహీనపడటంతో  మార్చి క్వార్టర్‌లో ఆదాయపు అంచనాలను అందుకోలేకపోవచ్చని ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ప్రకటనతో అమెరికా ఫ్యూచర్లతో పాటు నేడు ఆసియా మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను చెల్లిస్తున్నప్పటికీ ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగంలో మొండి రుణాలపై ఆందోళనలు నెలకొన్నాయి. క్రూడాయిల్‌ ధర జనవరి నెల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకం‍లో రూపాయి విలువ నిన్నటి ముగింపు (71.29) స్థాయితో పోలిస్తే 11 పైసలు బలహీనపడి 71.40 మొదలవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. 

ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ నిన్నటి ముగింపు (41,055.69)తో పోలిస్తే 206 పాయింట్ల నష్టంతో 40,849.19 వద్ద, నిఫ్టీ క్రితం ముగింపు స్థాయి(12,045.80)తో పోలిస్తే 68.20 పాయింట్లను కోల్పోయి 12వేల దిగువున 11,977 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక్క మీడియా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఐటీ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఇదే సమయానికి నిఫ్టీ-50 ఇండెక్స్‌లో...
టాటా మోటర్స్‌, హీరోమోటోకార్ప్‌, హిందాల్కో, ఇండస్‌ ఇండ్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 4.50శాతం నష్టపోయాయి. మరోవైపు హెచ్‌సీఎల్‌, సిప్లా, జీలిమిటెడ్‌ షేర్లు 0.10శాతం నుంచి 1.75శాతం లాభపడ్డాయి. You may be interested

స్వల్ప కాలానికి టెక్నికల్‌ రికమండేషన్స్‌

Tuesday 18th February 2020

కరోనా వైరస్‌ విస్తరిస్తుండటం, జీడీపీ వృద్ధి గణాంకాలను మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం వంటి ప్రతికూలతల నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాల ఆధారంగా స్వల్ప కాలానికి మార్కెట్‌ విశ్లేషకులు కొన్ని స్టాక్స్‌ రికమండేషన్స్‌ ఇస్తున్నారు. వీటిలో కొన్ని సెల్‌(అమ్మవచ్చు) కాల్స్‌ కాగా.. మరికొన్ని కొనుగోలు(బయ్‌) సిఫారసులున్నాయి. వివరాలు చూద్దాం.. అశ్వనీ గుజ్రాల్‌, అశ్వనీ గుజ్రాల్‌.కామ్‌ రూ. 78 టార్గెట్‌తో బీవోబీ సెల్‌ చేయవచ్చు. రూ.

ఎన్‌సీఎల్‌ఏటీ మరెన్నో అంశాలను పట్టించుకోలేదు!

Tuesday 18th February 2020

సుప్రీంకోర్టులో సైరస్‌ మిస్త్రీ క్రాస్‌ అప్పీల్‌ ముంబై: నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబర్‌ 18న తనకు అనుకూలంగా రూలింగ్‌ ఇచ్చినా, తన పిటిషన్‌లోని ఎన్నో అంశాలను పట్టించుకోలేదని, తనకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని పేర్కొంటూ సైరెస్‌ మిస్త్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన వివాదానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో క్రాస్‌ అప్పీల్‌ వేశారు. మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌గా తిరిగి నియమించాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన

Most from this category