News


41వేల శిఖరంపై సెన్సెక్స్‌, కొత్త గరిష్టంపై నిఫ్టీ ప్రారంభం

Tuesday 26th November 2019
Markets_main1574741029.png-29853

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల అంశాలతో మంగళవారం సూచీలు కొత్త రికార్డు స్థాయిల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 133 పాయింట్లు పెరిగి 41వేల శిఖరంపై 41,022 వద్ద మొదలైంది. తన జీవితకాల గరిష్టస్థాయి 12103 స్థాయిని అధిగమించి 37 పాయింట్లు లాభంతో  12,110.20 వద్ద ప్రారంభమైంది.  అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహన అంచనాలతో నిన్నరాత్రి అమెరికా మార్కెట్ల రికార్డు ముగింపు, నేటి ఉదయం ఆసియా మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ మనదేశ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్థిరంగా ఉండంటం, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి 5పైసల లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభం కావడం కలిసొచ్చాయి. ఒక్క మీడియా తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. క్రితం ట్రేడింగ్‌లో సూచీలను నడిపించిన బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల ర్యాలీ నేడు కొనసాగుతుంది.ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 31,734.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
సన్‌ ఫార్మా, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం పెరిగాయి. గ్రాసీం, నెస్లే, భారతీ ఎయిర్‌టెల్‌, జీ లిమిటెడ్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1శాతం నుంచి 4.50శాతం నష్టపోయాయి.



You may be interested

కోడిగుడ్లతో ఏటా రూ.7,500 కోట్ల నష్టం!

Tuesday 26th November 2019

గిట్టుబాటు ధర లేకపోవటమే కారణం తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 8.5 కోట్ల గుడ్ల ఉత్పత్తి రూ.1.1 లక్షల కోట్లకు చేరిన దేశీ పౌల్ట్రీ పరిశ్రమ ఐపీఈఎంఏ ప్రెసిడెంట్‌ చక్రధర రావు పొట్లూరి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గిట్టుబాటు ధర లేకపోవటం, మొక్కజొన్న, సోయాబిన్‌ లభ్యత తక్కువగా ఉండటం, దాణ ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల దేశంలో కోడి గుడ్ల ఉత్పత్తిదారులు ఏటా రూ.7,500 కోట్లు నష్టపోతున్నట్లు పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. ఏటా దేశంలో 8,800

ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Tuesday 26th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్‌లో 5 పైసలు బలపడి 71.68 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్లాట్‌గా 71.74 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో పాటు, అంతర్జాతీయంగా డాలర్‌ బలపడడం వంటి అంశాలు రూపీ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. యుఎస్‌-చైనా మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌కు వాణిజ్య ఒప్పందంతో తొందరలో ముగింపు దొరుకుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గత

Most from this category