ప్రారంభంలో సూచీల హెచ్చుతగ్గులు
By Sakshi

మార్కెట్ ఆరురోజుల వరుస లాభాల ముగింపు పలుకుతూ మంగళవారం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 65 పాయింట్ల నష్టంతో 39,233.40 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 11,652.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే 10శాతం నష్టపోయి రూ.691.10 వద్ద లోయర్ సర్కూ్యట్ వద్ద ఫ్రీజ్ అయ్యాయి. అనంతరం రిలీవ్ అయ్యి భారీ పతనం దిశగా కదులుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినట్లు గత శుక్రవారం విడుదలైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మినిట్స్ సూచిస్తుండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. మరోవైపు గతవారం ఆశాజన ఆర్థిక ఫలితాలను వెల్లడించిన ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్(2శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్(1 శాతం) షేర్లు ఇండెక్స్‌కు అండగా నిలుస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక, మీడియా, ఫార్మా, షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఐటీ, అటో, మెటల్ షేర్లు అమ్మకా ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉదయం 9:40ని.లకు సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టంతో 39,243.50 వద్ద, నిఫ్టీ 5 పాయింట్లను కోల్పోయి 11,650 వద్ద ట్రేడ్ అవుతోంది. హెచ్‌సీఎల్‌టెక్, ఎంఅండ్, టాటాస్టీల్, టాటామోటర్స్, ఇన్ఫోసిస్ షేర్లు 1శాతం నుంచి 13.50శాతం నష్టపోయాయి. భారతీ ఎయిర్టెల్, విప్రో, పవర్ గ్రిడ్, టైటాన్ యస్‌బ్యాంక్ షేర్లు 2శాతం నుంచి 6.50శాతం లాభపడ్డాయి.
You may be interested
రిలయన్స్ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్!
Tuesday 22nd October 2019సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. పలు బ్రోకరేజ్‌లు కంపెనీ షేరు టార్గెట్ ధరను పెంచాయి. ఆర్‌ఐఎల్‌పై వివిధ బ్రోకింగ్ సంస్థల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... 1. యూబీఎస్: కొనొచ్చు రేటింగ్. టార్గెట్ రూ. 1500. కమోడిటీ తలనొప్పులున్నా, కంపెనీ బలమైన ఫలితాలు ప్రకటించింది. పెట్‌కెమ్ ఉత్పత్తి రికార్డు గరిష్ఠాలను తాకింది. జియో ఫైబర్ ఇన్ఫ్రాపై ఎక్కువ దృష్టి పెడుతోంది. 2. కోటక్
ఫలితాల ఎఫెక్ట్...ఆర్ఐఎల్ 1.5 శాతం అప్
Tuesday 22nd October 2019రిలయన్స్ ఫలితాలు బాగుండడంతో మంగళవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు 1.5 శాతం గ్యాప్‌అప్‌తో రూ. 1,436 వద్ద ప్రారంభమయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి రికార్డ్ స్థాయిలో లాభాన్ని శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు ఎగిసింది. ఉదయం 9.45 సమయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 0.96శాతం