News


సెన్సెక్స్‌ 634 పాయింట్ల రికవరి

Friday 2nd August 2019
Markets_main1564736496.png-27502

నష్టాలతో ప్రారంభమైన మార్కె్‌ట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లో మళ్లింది. ఇటీవల మార్కెట్లో భారీ పతనంతో కనిష్టస్థాయిలకు పతనమైన షేర్లు చౌక ధరలకు లభిస్తుండంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు. పలితంగా సూచీలు ఉదయం నష్టాలను పూడ్చుకొని లాభాల్లోకి మళ్లాయి. అటో, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం(10,848.95) నుంచి 192 పాయింట్ల రికవరినీ, సెన్సెక్స్‌ కనిష్టస్థాయి(36,607.41) నుంచి 634 పాయింట్ల రికవరిని సాధించాయి. మరోవైపు మెటల్‌, మీడియా, రియల్టీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మధ్యాహ్నం గం.2:00లకు సెన్సెక్స్‌ 313 పాయింట్లు పెరిగి 37,331.85 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 11,070.00 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 
ఐషర్‌మోటర్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ అటో, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 3శాతం నుంచి 6శాతం లాభపడగా, ఐఓసీ, హెచ్‌సీఎల్‌టెక్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, విప్రో షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టపోయింది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ క్యూ1: నికర లాభంలో 46 శాతం వృద్ధి

Friday 2nd August 2019

హెచ్‌డీఎఫ్‌సీ తన జూన్‌ క్వార్టర్‌ ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన స్టాండ్‌ ఎలోన్‌ లాభంలో 46 శాతం వృద్ధిని సాధించి, రూ.3,202 కోట్లను నమోదుచేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.2,190 కోట్లుగా ఉంది. కాగా మార్కెట్లు స్టాండ్‌ఎలోన్‌ లాభం రూ.3,040 కోట్లుగా ఉంటాయని అంచనా వేశాయి. గృహ్‌ ఫైనాన్స్‌లోని కొంత వాటాను విక్రయించడంతో రూ.1,895 కోట్ల లాభం చేకూరిందని కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే

క్యూ1 ఫలితాలు: అంచనాల్ని అందుకోని ఎస్‌బీఐ

Friday 2nd August 2019

దేశియ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా , ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్యూ1 ఫలితాలలో మార్కెట్ల అంచనాలను అందుకోలేకపోయింది. నికర లాభం రూ.4,000 కోట్లను ప్రకటిస్తుందని అంచనా వేయగా అది రూ.2,312 కోట్లకు పరిమితమయ్యింది. స్థూల నిరార్థక ఆస్తులు(ఎన్‌పీఏ) త్రైమాసిక ప్రాతిపదికన ఎటువంటి మార్పు లేకుండా 7.53 శాతంగానే ఉన్నాయి. కానీ నికర ఎన్‌పీఏలు మాత్రం ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 3.01 శాతం ఉండగా

Most from this category