News


స్వల్ప లాభంతో ముగింపు

Wednesday 23rd October 2019
Markets_main1571827537.png-29085

ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య ట్రేడైన సూచీలు చివరికి స్వల్ప లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 95 పాయింట్ల లాభంతో 39,059 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 11,604 వద్ద స్థిరపడ్డాయి. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానుండటం, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితి తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, ఫార్మా షేర్లుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు మెటల్‌, రియల్టీ, మీడియా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకా ఒత్తిడికి లోనయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 48 పాయింట్లు లాభపడి 29,459.60 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ క్యాప్‌ ఇండెక్స్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు అరశాతం వరకు లాభపడ్డాయి. ఇంట్రాడేలో నిఫ్టీ ఇండెక్స్‌ 11,554.40 - 11,651.60 రేంజ్‌లో సెన్సెక్స్‌ 38,866.08 -39,196.67 స్థాయిలో కదలాడాయి.    

జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, మారుతి, ఇన్ఫోసిస్‌, ఐషర్‌మోటర్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. గ్రాసిమ్‌, వేదాంత, జీ లిమిటెడ్‌, భారతీ ఎయిర్‌టె్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు 2శాతం నుంచి 6శాతం నష్టపోయాయి. 



You may be interested

వచ్చే ఏడాది పీఎస్‌యూలే లీడర్లు: రమేష్‌ దమాని

Wednesday 23rd October 2019

‘నేను పీఎస్‌యూ స్టాకులను కొనుగోలు చేయను, పీఎస్‌యూల వైపు చూడను వంటి మాటలు మార్కెట్‌లో సాధరణమయ్యాయి. ఒకవేళ నువ్వు వాల్యూ ఇన్వెస్టర్‌ అయితే ముఖ్యంగా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ చేస్తుందని నమ్మితే పీఎస్‌యూ స్టాకులను పరిశీలిస్తావు’ అని బీఎస్‌ఈ మెంబర్‌ రమేష్‌ దమాని ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. కొత్త సంవత్‌లో కొత్త లీడర్‌ కావాలి.. ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిన తర్వాత మార్కెట్‌ చాలా పాజిటివ్‌గా

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌కు రేటింగ్‌ షాక్‌..!

Wednesday 23rd October 2019

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో గురువారం ఆర్‌బీఎల్‌ షేర్లు రికార్డు కనిష్టస్థాయికి పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.258.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ ఏడాది క్యూ2లో బ్యాంక్‌ నికర లాభం 73శాతం క్షీణించి రూ. 54.3 కోట్లకు పరిమితమైంది. స్థూల ఎన్‌పీఏలు 1.38 శాతం నుంచి 2.6 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.65 శాతం నుంచి 1.56 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు రూ. 140

Most from this category