News


ఆరురోజుల నష్టాలకు బ్రేక్‌

Friday 26th July 2019
Markets_main1564138595.png-27341

  • కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌
  • రాణించిన అటో, బ్యాంకింగ్‌ షేర్లు

సూచీల ఆరురోజుల సుధీర్ఘ నష్టాల ముగింపునకు శుక్రవారం బ్రేక్‌ పడింది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 11,250ల పైన 11,284.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 52 పాయింట్లు లాభపడి 37,883 వద్ద స్థిరపడింది. నేటి నుంచి ఆగస్ట్‌ డెరివేటివ్స్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ట్రేడర్లు కొత్త పొజిషన్లకు ఆసక్తి చూపడంతో పాటు షార్ట్‌ కవరింగ్‌కు పూనుకున్నారు. ఆరు రోజుల వరుస పతనం అనంతరం అధిక వాల్యూ కలిగిన షేర్లు తక్కువ ధర వద్ద లభిస్తుండంతో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లు జరిపారు. ఫలితంగా అటో, బ్యాంకింగ్‌ షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మహీంద్రా, అండ్‌ మహీంద్రా, యస్‌బ్యాంక్‌, హీరోమోటోకార్ప్‌, టాటామోటర్స్‌తో పాటు బజాజ్‌ అటో షేర్ల ర్యాలీ సూచీలను ఆరు రోజుల నష్టాల నుంచి గట్టెక్కించాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతం ర్యాలీ చేయగా, ఎస్‌అండ్‌పీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ పావు శాతం ర్యాలీ లాభపడింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో పాటు 282 పాయింట్లు(1శాతం) పెరిగి 29000 స్థాయి పైన 29,325.30 వద్ద స్థిరపడింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ(9 పైసలు) బలపడంతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి.
‘‘మార్కెట్‌ ఆరురోజుల పతనానికి ముగింపు పడినప్పటికీ.., రికవరీ పూర్తి స్థాయిలో జరగలేదు. క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిల్లో నమోదుకాలేకపోవడంతో పాటు దేశవ్యాప్తంగా వర్షపాతం తగినంత స్థాయిలో నమోదు కాకపోవడం ఇందుకు కారణాలు చెప్పుకోవచ్చు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల అలోచనా విధానం రానున్న రోజుల్లో కీలకం’’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇన్ప్రాటెల్‌, ఐషర్‌మోటర్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 9శాతం లాభపడగా, టెక్‌మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐఓసీ, వేదాంత లిమిటెడ్‌ షేర్లు 1శాతం నుంచి 4.50శాతం నష్టపోయాయి. 



You may be interested

నష్టాల నుంచి లాభాల్లోకి పీఎన్‌బీ

Friday 26th July 2019

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జూన్‌ క్యార్టర్‌ ఫలితాలలో రూ. 1,018.63 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.940 కోట్ల నికర నష్టాలను ప్రకటించిన ఈ బ్యాంకు, ఇప్పుడు లాభాల్లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ కేటాయింపులు మాత్రం 65 శాతం(ఏడాది నుంచి ఏడాదికి) తగ్గిపోవడం గమనర్హం. జూన్‌ త్రైమాసికంలో రూ.350 కోట్ల నికర నష్టాలను ప్రకటిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు.    వార్షిక ప్రాతిపదికన

బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 7 శాతం జంప్‌

Friday 26th July 2019

ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందిస్తున్న బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్ల ధరలు శుక్రవారం 7.50శాతం లాభడ్డాయి. క్రితం రోజు వెలువడిన క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడం ఇందుకు కారణమైంది.  బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.3,046.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో ఇంట్రాడేలో షేర్లు 9.50శాతం లాభపడి రూ.3278ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. మార్కెట్‌ ముగిసే సరికి షేరు గతముగింపు ధర(రూ.3,046.50)తో

Most from this category