News


కొత్త శిఖరాలపై ముగిసిన సూచీలు

Tuesday 17th December 2019
Markets_main1576579705.png-30275

  • ఇంట్రాడే, ముగింపులోనూ రికార్డులే...
  • కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ అంశాలు 
  • మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు 

జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలను కూడగట్టుకుంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి  మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌, అటో రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఫలితంగా ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలతో పాటు బ్యాంక్‌ సైతం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 463 పాయింట్లు పెరిగి 41,401.65 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 413 పాయింట్ల లాభంతో 41,352.17 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ కూడా ఈ ఏడాదిలో 9వ సారి సరికొత్త రికార్డును నెలకొల్పింది. నవంబర్‌ 28న నమోదు చేసిన 12158 స్థాయిని అధిగమించి 12,182.75 వద్ద కొత్త రికార్డు నెలకొల్పింది. చివరికి 111 పాయింట్ల లాభంతో 12,165 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల అండతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 239 పాయింట్లను ఆర్జించి 32,213 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 32,140.25 వద్ద స్థిరపడింది. ఫార్మా, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. 
అమెరికా చైనా వాణిజ్య ఒప్పందం:- 
అమెరికా చైనాల మధ్య గతవారంలో కుదిరిన తొలి దశ వాణిజ్య ఒప్పందం మార్కెట్‌ ర్యాలీకి ప్రధాన కారణమైందని చెప్పవచ్చు. ఒప్పంద పత్రాలపై ఇప్పటికీ ఇరుదేశాల అధ్యక్షులు సంతకాలు చేయకపోవడంతో ఇప్పటికీ వాణిజ్య ఒప్పంద విజయవంతంపై కొంత అనుమానాలు వ్యక్తం రేకత్తాయి. ఈ నేపథ్యంలో నిన్న వైట్‌హౌస్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ లారీ కుడ్లీ చైనాతో వాణిజ్య ఒప్పందం ఖచ్చితంగా కుదిరిందని వివరణ ఇచ్చారు. ఆర్థికంగా రెండు అతిపెద్ద దేశాల మధ్య జరిగిన 17నెలల వాణిజ్య యుద్ధానికి తాత్కలిక ఉపశమనం లభించడంతో ఇన్వెస్టర్లు​ రిస్క్‌ అసెట్స్‌అయిన ఈక్విటీల్లో పెట్టుబడులకు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. సోమవారం చైనా ఇండస్ట్రియల్‌, రిటైల్‌ నవంబర్‌ గణాంకాలు మార్కెట్‌ అంచనాలకు మించి నమోదుకావడం ఈక్విటీ మార్కెట్లకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.

ఈక్విటీల కొనుగోలుకు ఎఫ్‌ఐఐల ఆసక్తి:-
బ్రెగ్జిట్‌ చుట్టూ నెలకొన్న అనిశ్చితి వాతావరణం వైదొలిగిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల కొనుగోలుకు  ఆసక్తి చూపుతున్నట్లు ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఎఫ్‌ఐఐలు దేశీయ ఈక్విటీ విభాగంలో ఈ నెలలో ఇప్పటికి వరకు రూ.850లు నికర పెట్టుబడులు పెట్టారు. ఈ నవంబర్‌లో రూ.12,924 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. 

ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్లో పెరగనున్న భారత్‌ వెయిటేజీ 
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే సంస్థలో చట్టబద్ధమైన ఎఫ్‌పిఐ పరిమితిని 24 శాతం నుంచి రంగాల విదేశీ పెట్టుబడుల పరిమితికి పెంచే బడ్జెట్ ప్రకటన అమలును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 13 న ధృవీకరించారు. దీంతో మోర్గాన్ స్టాన్లీ రేటింగ్‌.... వచ్చే 2020 మే నాటికి భారత ఎమ్‌ఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ వెయిటేజీ​ 70బేసిస్‌ పాయింట్లు పెరగవచ్చని అంచనా వేసింది. 

సాంకేతిక కారణాలు:- 
అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో సోమవారం బేరిష్‌ ఫార్మేషన్‌ను మార్కెట్‌ తిరస్కరించింది. నిఫ్టీ ఇండెక్స్‌ కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో 12,290-12,350 శ్రేణిలో కొత్త నిరోధ స్థాయిని ఏర్పాటు చేసుకున్నట్లు లాంగ్‌ టర్మ్‌ ఛార్ట్‌లు సూచిస్తాయని చతుర్వేదీడాట్‌కామ్‌  టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజర్‌ మజర్‌ మహమ్మద్‌ అభిప్రాయపడ్డారు.


టైటాన్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, గెయిల్‌, సన్‌ఫార్మా షేర్లు అరశాతం నుంచి 1.25శాతం నష్టపోయాయి. టాటామోటర్స్‌, హిందాల్కో, వేదాంత, భారతీఎయిర్‌టెల్‌, టాటాస్టీల్‌ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం పెరిగాయి. 
 You may be interested

‘ఫార్మా, బ్యాంకులు, మెటల్స్‌లో మంచి పనితీరు’

Wednesday 18th December 2019

మార్కెట్లు కీలక మద్దతు స్థాయిలైన 12,000-11,900 వరకు తగ్గినప్పుడల్లా కొనుగోలు విధానాన్ని అనుసరించొచ్చని, రానున్న వారాల్లో మెటల్‌, ఫార్మా, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపించొచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ రాజేష్‌పాల్వియా చెప్పారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.    మార్కెట్లపై స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం..? విదేశీ పోర్ట్‌ఫోలియో

మూడు స్టాకులపై మోర్గాన్‌స్టాన్లీ బుల్లిష్‌

Tuesday 17th December 2019

టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ప్రముఖ బ్రోకరేజ్‌ మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. వచ్చే ఏడాదిలో ఈ స్టాకులు దాదాపు 20 శాతం వరకు రాబడినిస్తాయని అంచనా వేసింది.  - టెక్‌ మహీంద్రా: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 850. కమ్యూనికేషన్‌ వ్యాపారం విభాగంలో కొత్త డీల్స్‌లో మెరుగుదల కనిపిస్తుంది. వచ్చే ఏడాది రెవెన్యూ గ్రోత్‌ 8-10 శాతం ఉండొచ్చు. మార్జిన్ల మెరుగుదలతో ఎర్నింగ్స్‌

Most from this category