ఆరో రోజూ ఆగని నష్టాలు..!
By Sakshi

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్ వరుసగా ఆరోరోజూ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి అరగంట అమ్మకాలతో సూచీలు మరింత నష్టపోయాయి. ఫార్మా, మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్, అటో, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 37,531.98 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు క్షీణించి 11,126.40 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్ఎస్ఈలోని కీలకమై బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 35 పాయింట్లు లాభపడి 27,767.55 వద్ద స్థిరపడింది. మీడియా రంగ షేర్లు కూడా స్వల్పంగా లాభపడ్డాయి. ‘‘ఈ గురు, శుక్రవారాల్లో అమెరికా, చైనాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. నిఫ్టీకి 11100 స్థాయి వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది. స్వల్పకాలంగా 11,100 - 11,250 శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది’’ అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 37,480.53-37,919.47 శ్రేణిలో, నిఫ్టీ 11,112.65 - 11,233.85 స్థాయిలో కదలాడింది.
సిప్లా, అల్ట్రాటెక్, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూస్టీల్, బీపీసీఎల్ షేర్లు 2.50శాతం నుంచి 5శాతం వరకు నష్టపోయాయి. నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, జీ లిమిటెడ్, యస్‌బ్యాంక్ షేర్లు 1శాతం నుంచి 7.60శాతం వరకు లాభపడ్డాయి.
You may be interested
మంచి వర్షాలతో లాభపడే కంపెనీలు!
Tuesday 8th October 2019గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో పుంజుకుంటుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మంచి వర్షాలతో రబీ పంటల సాగు బలంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం 25 ఏళ్లలోనే కనిష్ట స్థాయికి ఈ ఏడాది చేరిన విషయం తెలిసిందే. 1994 తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. పంట ఉత్పాదకత అధికం కావడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ అధిక వ్యయాలు
ఫార్మా షేర్లకు యూఎస్ఎఫ్డీఏ షాక్
Monday 7th October 2019యూఎస్ఎఫ్డీఏ లేవనెత్తిన అభ్యంతరాల ప్రభావంతో సోమవారం ట్రేడింగ్‌లో దేశీయ ఫార్మా కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ నేడు దాదాపు 3.50శాతం నష్టపోయింది. అత్యధికంగా అరబిందో ఫార్మా షేర్లు 20 శాతంపైగా కుప్పకూలాయి. అదేబాటలో గ్లెన్‌మార్క్ షేర్లు 9శాతం పతనమయ్యాయి. పిరమిల్ఎంటర్ప్రైజెస్ షేర్లు 8శాతం, లుపిన్ 3.50శాతం, సిప్లా 2.50శాతం, కేడిల్లా హెల్త్‌కేర్ 2శాతం, బయోకాన్, సన్‌ఫార్మా షేర్లు 1.50శాతం