చివరి అరగంటలో అమ్మకాలు.. అయినా లాభాల ముగింపే..!
By Sakshi

చివరి అరగంటలో బ్యాంకింగ్ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని కోల్పోయి పరిమిత లాభంతో ముగిశాయి. సెన్సెక్స్ 87.39 పాయింట్ల లాభంతో 38,214.47 వద్ద, నిఫ్టీ 36.20 పాయింట్లు పెరిగి 11,341.20 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా రెండో రోజూ లాభాల ముగింపు. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, అంతర్జాతీయంగా మడిచమురు ధరలు తగ్గముఖం పట్టడం, నేడు వెల్లడైన ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా నమోదు కావడం తదితర సానుకూలాంశాలతో సూచీలు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. ఒకదశలో సెన్సెక్స్ 386 పాయింట్లు పెరిగి 38,513.69 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 11,420.45 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. అయితే చివరి అరగంటలో బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనడంతో సూచీలు ఇంట్రాడే లాభాలు హరించుకుపోయాయి. అటో, మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లు అమ్మకాలు నెలకొన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 139 పెరిగి 28,153.00 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్ 11300 వద్ద బలమైన మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. రేపు ఈ స్థాయి పైన ప్రారంభమై, ముగిసినట్లైతే రానున్న రోజుల్లో 11500 స్థాయిని చేరుకోగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, టాటామోటర్స్, ఓఎన్జీసీ షేర్లు 2.50శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి. యూపీఎల్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, ఇన్ఫోసిస్ షేర్లు 1శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి.
You may be interested
పసిడి పరుగులు కొనసాగేనా?!
Monday 14th October 2019ట్రేడ్‌వార్ ముగింపుతో బుల్స్‌కు పగ్గాలు దీర్ఘకాలానికి పాజిటివ్ అంటున్న నిపుణులు అంతర్జాతీయ మందగమనం, ట్రేడ్‌వార్ భయాలతో ఇటీవల కాలంలో బంగారం అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో మంచి ర్యాలీ చేసింది. ఒక దశలో పసిడి అంతర్జాతీయ మార్కెట్లో 1600 డాలర్లకు చేరవచ్చని నిపుణులు అంచనాలు వేశారు. అయితే ఇటీవల కాలంలో పసిడి ధర 1500 డాలర్ల జోన్లో కన్సాలిడేట్ అవుతోంది. ట్రేడ్‌వార్‌పై చైనా, యూఎస్ మధ్య ఆశావహ వాతావరణం ఏర్పడుతుండడంతో ఇకపై ఈక్విటీల జోరు
ఏడాది గరిష్ఠానికి భారతీ ఎయిర్టెల్
Monday 14th October 2019టెలికాం రంగంలో ప్రధాన కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ (ఐయూసీ) కాల్స్‌పై 6 పై./ని. చార్జ్ చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయం ఇదే రంగంలో ఉన్న పెద్ద కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌కు లాభం చేకూర్చే అవకాశం ఉందన్న అంచనాలు ఎయిర్టెల్ షేరుపై పాజిటివ్ ప్రభావం చూపాయి. భవిష్యత్ లో ఈ నిర్ణయం వలన ధరలను పెంచడంతో ఎయిర్‌టెల్‌కు ఒత్తిడి తగ్గవచ్చని, అందువల్ల కంపెనీ లాభాలు భారీగా