News


మళ్లీ లాభాల ముగింపు

Thursday 30th May 2019
Markets_main1559213088.png-26006

329 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 
మే డెరివేటివ్స్‌ కాంటాక్టులు ముగింపు కారణంగా మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లతో గురువారం మార్కెట్‌ భారీ లాభంతో ముగిశాయి. అలాగే నేటి రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో సెన్సెక్స్‌, నిప్టీలు దూసుకుపోయాయి. సెన్సెక్స్‌ 323 పాయింట్ల లాభపడి 39,832 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 11,946 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలున్నప్పటికీ, నేడు మార్కెట్‌ లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 90 పాయింట్ల లాభంతో 39,595 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 11, 885 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సూచీలు ఏదశలో వెనుదిరగలేదు. బ్యాంకింగ్‌, ఐటీ, ఫైనాన్స్‌ సర్వీసెస్‌ షేర్లు లాభపడ్డాయి. సమయం గడుస్తున్న కొద్ది సూచీలు తన లాభాలన్ని క్రమంగా పెంచుకుంటూ పోయాయి. మిడ్‌ సెషన్‌ నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు మరింత పెరగడంతో సెన్సెక్స్‌ ఓ దశలో 410 పాయింట్ల మేర పెరిగి 39,912 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల లాభపడి 11,968.55 స్థాయిల వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే రేపు ఈ ఆర్థిక సంవత్సరపు చివరి క్వార్టర్‌ జీడీపీ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో సూచీల లాభాలు కొంతమేర హరించుకుపోయాయి. 
భారతీఎయిర్‌టెల్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, జీ లిమిటెడ్‌, ఐషర్‌మోటర్స్‌, సన్‌ ఫార్మా షేర్లు 1.50శాతం నష్టపోయాయి.



You may be interested

ఎఫ్‌ఐఐల పునరాగమనం ఖాయం...

Friday 31st May 2019

ఎన్నికల ఫలితాల ముందు అప్రమత్తతతో అమ్మకాలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు... తిరిగి భారత మార్కెట్లలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావడం ఖాయమేనంటున్నారు మార్కెట్‌ నిపుణులు. సంస్కరణలు కొనసాగగలవన్న నమ్మకం, సానుకూల వ్యాపార వాతావరణం, ఆర్థిక రంగ బలం ఇవన్నీ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే మన మార్కెటే ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లకు బలంగా ఉందని గుర్తు చేస్తున్నారు.    ప్రస్తుత మే నెలలో28వ తేదీ వరకు

రెండేళ్లలో 15వేలకు నిఫ్టీ!

Thursday 30th May 2019

బ్రోకరేజ్‌ల అంచనా లిక్విడిటీ సమస్యలకు పరిష్కారం చూడడం, ఇన్‌ఫ్రా వ్యయాలు పెంచడం, భారీగా ఉద్యోగకల్పన, సాగు సంస్కరణలు, జీఎస్‌టీ సరళీకరణ.. నూతన ప్రభుత్వం నుంచి ఆశించే కీలకాంశాలని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. అనుకున్నట్లుగా రాబోయే రోజుల్లో ఇవన్నీ నెరవేరితే బలమైన ఎర్నింగ్స్‌ గ్రోత్‌ఉంటుంది. తద్వారా భారీ ర్యాలీని ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌ వర్గాలు ఆశించిన విధంగా కొత్త ప్రభుత్వ చర్యలుంటే అన్ని రకాల స్టాకుల్లో విస్తృత ర్యాలీ ఉంటుందని,

Most from this category