News


11900 దిగువకు నిఫ్టీ

Tuesday 10th December 2019
Markets_main1575974605.png-30157

ఐటీ, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో మంగళవారం మార్కెట్‌ నష్టాలను చవిచూసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 247 పాయింట్లు నష్టపోయి 40,240 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లను కోల్పోయి 11,857 వద్ద స్థిరపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి నెలరోజుల గరిష్టానికి ఎగిసిన నేపథ్యంలో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో మెటల్‌ షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 31,160.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌లో అన్నిరంగాలకు చెందిన ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడే నిఫ్టీ 11,950.50 - 11,844.70 రేంజ్‌లో, సెన్సెక్స్‌ 40,588.81 - 40,208.70 స్థాయిలో ట్రేడయ్యాయి. 

నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ వరుసగా 4రోజూ నష్టాలతో ముగిసింది. 
నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ వరుసగా 4రోజూ నష్టాలతో ముగిసింది.
నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ వరుసగా 3రోజూ నష్టాలతో ముగిసింది. 
నిఫ్టీ మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడే గరిష్టం నుంచి 2శాతం వరకు నష్టపోయాయి.
 

బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, గెయిల్‌, జీ లిమిటెడ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 10.50శాతం నష్టపోయాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటర్స్‌, సిప్లా, హిందూస్థాన్‌ యూనిలివర్‌, బజాజ్‌ఫైనాన్స్‌ సర్వీసెస్‌ షేర్లు 1శాతం నుంచి 1.25శాతం లాభపడ్డాయి. 



You may be interested

నిఫ్టీ.. మరికొంత దిద్దుబాటు!

Wednesday 11th December 2019

నిఫ్టీ మంగళవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ లాభాలను కాపాడుకోలేకపోయింది. సెషన్‌లో ఎక్కువ సమయం పాటు నష్టాల్లోనే కొనసాగింది. ఈ క్రమంలో 11,883 స్థాయిలో ఉన్న స్వల్ప మద్దతును కోల్పోయి దిగువన 11,856 వద్ద ముగిసింది. నికరంగా 80 పాయింట్లు 0.68 శాతం నష్టపోయింది. సోమవారం అనిశ్చయాన్ని సూచించే డోజి ఏర్పాటు తర్వాత ట్రెండ్‌ రివర్సల్‌కు నిఫ్టీ సంకేతం ఇవ్వలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో రానున్న

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Tuesday 10th December 2019

మార్కెట్‌ నెలకొన్న అమ్మకాల్లో భాగంగా మెటల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్‌ దాదాపు 2శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,549.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ను ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లలో అ‍మ్మకాలు కొనసాగడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1.85శాతం నష్టపోయి 2,510.75 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌

Most from this category