News


రికార్డుల ర్యాలీకి బ్రేక్‌..!

Friday 29th November 2019
Markets_main1575024226.png-29958

  • సూచీల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ
  • 336.36 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

సూచీల రెండు రోజుల రికార్డుల ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. సూచీల జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణ, నేడు రెండో క్వార్టర్‌ జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత ఇందుకు కారణమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల వాతావరణం సెంటిమెంట్‌ను కొంతమేర దెబ్బతీసింది. మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 336 పాయింట్ల నష్టంతో 40,793.81 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 95 పాయింట్లను కోల్పోయి 12,056 వద్ద ముగిసింది. ఒక్క రియల్టీ రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా అటో రంగ షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈ కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 32వేల దిగువున 31,946.10 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 40,664.18 - 41,143.22 స్థాయిలో కదలాడగా, నిప్టీ 12,017.40 - 12,147.40 శ్రేణిలో కదలాడింది. నేటి ట్రేడింగ్‌లో సూచీలు నష్టాలను నష్టపోయి చవిచూసినప్పటికీ.., వరుసగా రెండోవారం లాభపడటం విశేషం. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 255 పాయింట్లను, నిఫ్టీ 142పాయింట్లను ఆర్జించగలిగాయి. 

నేటి సాయంత్రం కేంద్రం సెప్టెంబర్‌ త్రైమాసికపు జీడీపీ గణాంకాలను విడుదల చేయనుంది. దేశీ, అంతర్జాతీయంగా మాంద్య పరిస్థితులు, వినియోగ డిమాండ్‌ క్షీణత, ప్రైవేట్‌ పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం తదితర ప్రతికూలాంశాలతో క్యు2లో జీడీపీ 5శాతంలోపు నమోదు కావచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సూచీలు ఈ వారంలో వరుసగా రెండుసార్లు జీవితకాల గరిష్టం వద్ద ముగిసిన నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అంతర్జాతీయంగా పరిణామాలను చూసినట్లైతే... హాంగ్‌కాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నవారికి మద్దతునిచ్చే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తాజాగా సంతకం చేయడంపై చైనా తీవ్రంగా వ్యతిరేకిచింది. దీంతో ఇరు దేశాల మధ్య జరగనున్న వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడంతో నేడు ఆసియ మార్కెట్లు నష్టాల ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. థ్యాంక్స్‌ టు గివింగ్‌ డే సందర్భంగా నిన్నటి రోజున అమెరికా మార్కెట్లకు సెలవు కావడంతో అమెరికా ఫ్యూచర్లు స్వల్పంగా నష్టాల్లో ఉన్నాయి.

ఎంఅండ్‌ఎం, టాటామోటర్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 2.50శాతం నుంచి 8శాతం నష్టపోయాయి. ఎన్‌టీపీసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు అరశాతం నంచి 6.50శాతం లాభపడ్డాయి. You may be interested

ఇండియాబుల్స్‌... ఉదయం ర్యాలీ, మధ్యాహ్నం పతనం

Friday 29th November 2019

కేంద్ర మంత్రిత్వ శాఖ సానుకూల ‍ప్రకటనతో కోర్టు కేసులో సానుకూల వార్తలతో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్లో భారీగా లాభపడిన ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ రియల్స్‌ ఎస్టేట్‌ షేర్లు మధ్యాహ్నం కల్లా భారీగా నష్టాలను చవిచూశాయి. కేసులో యాజమాన్య వాదనలకు ప్రభుత్వం నుంచి కొంత మద్దతు లభించడంతో పాటు సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజ్‌ సంస్థ షేరు టార్గెట్‌ను పెంచిన నేపథ్యంలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేరు

ప్రాఫిట్‌ బుకింగ్‌కు ఇన్వెస్టర్ల మొగ్గు

Friday 29th November 2019

డిసెంబర్‌ సీరిస్‌ను సూచీలు నష్టాలతో ఆరంభించాయి. జీడీపీ గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గుచూపారు. జీడీపీ ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోతున్న అంచనాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. అయితే ఇది స్వల్పకాలిక విరామమేనని, మిడ్‌- లాంగ్‌ టర్మ్‌కు సూచీల మూడ్‌ పాజిటివ్‌గానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌ఐఐ నిధుల రాకడ, అంతర్జాతీయ పరిణామాలు పాజిటివ్‌గా ఉండడం.. మార్కెట్‌పై పాజిటివ్‌ ప్రభావం కొనసాగిస్తాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. లిక్విడిటీ

Most from this category