News


ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Wednesday 28th August 2019
Markets_main1566964709.png-28058

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 14 పాయింట్ల లాభంతో 37,655.77 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు స్వల్ప నష్టంతో 11,101.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడే వీలున్నట్లు పెరిగిన ఆందోళనలతో మంగళవారం అమెరికా మార్కెట్లు, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.  ఇక దేశీయ పరిణామాల విషయానికోస్తే.. ఈక్విటీ మార్కెట్‌ నుంచి ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తుండటం, రేపు ఆగస్ట్‌ ఎఫ్‌అండ్‌ఓ డెరివెటివ్స్‌ ముగింపు ఉండటం, ఈ నెలాఖరున(ఆగస్ట్‌ 31న) దేశీయ క్యూ1 జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తుండటం మార్కెట్‌పై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉదయం గం.9:20ని.లకు నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 11,112 వద్ద, సెన్సెక్స్‌ 37.16 పాయింట్లు పెరిగి 37,678.43 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐటీ, మీడియా, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. మరోవైపు మెటల్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 
ఇండస్‌ఇండ్‌, టాటాస్టీల్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, మారుతి, కోల్‌ ఇండియా షేర్లు 1శాతం నుంచి 1.50శాతం నష్టపోగా, టాటామోటర్స్‌, సిప్లా, గెయిల్‌, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. 



You may be interested

తగ్గిన యుఎస్‌ నిల్వలు ..పెరిగిన చమురు

Wednesday 28th August 2019

యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పడిపోవడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణ కొంత సరళం అవ్వడంతో చమురు ధరలు బుధవారం(అగస్టు 28) ట్రేడింగ్‌లో పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.7 శాతం పెరిగి బారెల్‌ 59.92 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 1 శాతం పెరిగి బారెల్‌ 55.50 డాలర్లకు చేరుకున్నాయి. గత వారం యుఎస్‌ చమురు నిల్వలు 20 లక్షల బారెల్‌ తగ్గుతుందని విశ్లేషకులు అంచనా

11,049 కోల్పోతే ప్రాఫిట్‌ బుకింగ్‌

Wednesday 28th August 2019

నిఫ్టీ రెండు వారాల గరిష్ట స్థాయిలో మంగళవారం క్లోజ్‌ అయింది. ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నిధులను డివిడెండ్‌గా బదిలీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ద్రవ్యలోటు ఆందోళనలను తేలికపరిచింది. దీనికితోడు అంతర్జాతీయంగానూ ప్రతికూల సంకేతాలు లేకపోవడం మార్కెట్లు సానుకూలంగా ముగియడానికి దోహదపడ్డాయి. నిఫ్టీ 11,049కి పైన నిలదొక్కుకుంటే తదుపరి 11,181 వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు చార్ట్‌వ్యూ ఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌.    ‘‘ఇండెక్స్‌ డైలీ చార్ట్‌లో డోజీ

Most from this category