STOCKS

News


12150పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 12th February 2020
Markets_main1581479940.png-31713

  • రెండోరోజూ లాభాల ప్రారంభమే
  • మెటల్‌, అటో షేర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు 

దేశీయ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 114 పాయింట్ల పెరిగి 41,330.85 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు లాభంతో 12,151.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధి ప్రభావం తగ్గముఖం పట్టవచ్చనే ఆశావహన అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభిచడం సెంటిమెంట్‌ను బలపరిచింది. నేడు డిసెంబర్‌ నెల పారిశ్రామికోత్పత్త, జనవరి రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 252.12 పాయింట్ల లాభంతో 41,468.26 వద్ద, నిఫ్టీ 77.30 పాయింట్లు పెరిగి 12,185.20 వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 180 పాయింట్ల(అరశాతం) లాభంతో 31,478.95 ట్రేడ్‌ అవుతోంది.


ఎస్‌బీఐ, గ్రాసీం, కోల్‌ఇండియా, వేదాంత, టాటాస్టీల్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం వరకు లాభపడ్డాయి. ఎల్‌ అండ్‌ టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫ్రాటెల్‌, ఇండస్‌ ఇండ్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 0.10శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. 



You may be interested

స్వల్పంగా తగ్గిన పుత్తడి

Wednesday 12th February 2020

బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.35 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ.40,420.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  ఔన్స్‌ బంగారం ధర 1,571.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (మంగళవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

పసిడి ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడుల ప్రవాహం

Wednesday 12th February 2020

జనవరిలో రూ. 200 కోట్లు ఏడేళ్లలో ఇదే అత్యధికం న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయపరమైన అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు.. పసిడి వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారు. దేశీయంగా ఇదే ధోరణి ప్రతిబింబిస్తూ.. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌)లో వరుసగా మూడో నెలా పెట్టుబడుల రాక కొనసాగింది. జనవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ. 200 కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇది ఏడేళ్ళ గరిష్టం. 2012 డిసెంబర్ తర్వాత

Most from this category