News


ప్రారంభంలో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచురీ

Friday 14th February 2020
Markets_main1581652929.png-31780

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి అనుకూల సంకేతాల్ని అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం జోరుగా మొదలైంది. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది క్షణాల్లోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభంతో 41,650 పాయింట్లపైకి, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 12,240 పైకి చేరిపోయింది. ట్రేడింగ్‌ను  ప్రస్తుతం భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు మందగమనంలో ఉన్నప్పటికీ.. ధీర్ఘాకాలంలో వృద్ధి ఊపందుకుంటుందని గ్లోబల్‌ దిగ్గజ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ‍  విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి లాభంతో ప్రారంభం కావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరించింది. కరోనా వైరస్‌ వ్యాధి భయాలు మరోసారి తెరపైకి రావడంతో నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు, నేడు ఆసియాలో ప్రధాన ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో చవిచూశాయి.ఒక్క రియల్టీ రంగ షేర్లకు తప్ప అన్నిరంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.41శాతం లాభంతో 31,357.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి నిఫ్టీ -50 ఇండెక్స్‌లో... 
యూపీఎల్‌, జీ లిమిటెడ్‌, బీపీసీఎల్‌, టాటా మోటర్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి. కోల్‌ ఇండియా, ఐషర్‌ మోటర్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు అరశాతం నష్టాన్ని చవిచూశాయి.



You may be interested

స్వల్పంగా తగ్గిన పుత్తడి

Friday 14th February 2020

కరోనా మరణాల సంఖ్య ఇంకా తగ్గకపోవడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులవైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం ధర స్థిరంగా కొనసాగుతూ  శుక్రవారం ఒక వారం గరిష్టానికి చేరింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.50 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ.40,590.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే 2 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం

షేర్ల దుర్వినియోగానికి చెక్‌

Friday 14th February 2020

ఆన్‌లైన్ వ్యవస్థను రూపొందించిన సెబీ న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లను స్టాక్ బ్రోకర్లు సొంతానికి వాడుకున్నా, ఇన్వెస్టర్ల నిధులను పక్కదారి పట్టించినా సత్వరం గుర్తించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ సిస్టమ్‌ను రూపొందించినట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గురువారం వెల్లడించింది. ఇలాంటి కేసుల్లో స్టాక్ ఎక్స్చేంజీలను ఈ సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేస్తుందని పేర్కొంది. క్లయింట్లు తనఖాగా ఉంచిన షేర్లను కొన్ని బ్రోకింగ్ సంస్థలు.. సొంత అవసరాల కోసం లేదా ఇతర క్లయింట్ల అవసరాల

Most from this category