News


స్వల్ప లాభంతో మొదలైన మార్కెట్‌

Monday 9th December 2019
Markets_main1575864104.png-30124

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ స్వల్ప లాభంతో మొదలైంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 82 పాయింట్ల లాభంతో 40,527.24 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభంతో 11,939.10ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అటో, ఫార్మా, మెటల్‌, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండగా, బ్యాంకింగ్‌, రియల్టీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోంటున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 9 పైసల నష్టంతో 71.29 వద్ద ప్రారంభమైంది. ఇక  అంతర్జాతీయ మార్కెట్ల విషయాకొస్తే... నవంబర్‌లో రికార్డు స్థాయిలో ఉపాధి కల్పన జరిగినట్లు గణాంకాలు వెలువడటంతో శుక్రవారం రాత్రి అమెరికా సూచీలు 1శాతానికి పైగా లాభంతో ముగిశాయి. అమెరికాతో చైనా వాణిజ్య ఒప్పందంపై సానుకూల వార్తల నేపథ్యంలో నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

టెక్‌ మహీంద్రా, సిప్లా, గెయిల్‌, యస్‌బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం వరకు నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంత, టాటా స్టీల్‌, జీ లిమిటెడ్‌, మారుతి సుజుకీ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. 



You may be interested

టారిఫ్‌ పెంపు అనంతరం టెలికం షేర్లు కొనొచ్చా?

Monday 9th December 2019

టారిఫ్‌ల పెంపు ప్రకటనల అనంతరం టెలికం రంగంలో టర్నెరౌండ్‌ ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే టెలికం షేర్లు టారిఫ్‌ల పెంపు ప్రకటన అనంతరం మంచి ర్యాలీ జరిపాయి. ఈ నేపథ్యంలో టెలికం షేర్లలో ఎంటర్‌ కావచ్చా? కొంత కరెక‌్షన్‌ కోసం చూడాలా? అని రిటైల్‌ మదుపరి సందేహ పడుతుంటాడు. ఈ అంశంపై నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి... టెలికం చార్జీల పెంపునకు స్పెక్ట్రం బకాయిల చెల్లింపు గడువు పెంచడం.. కంపెనీలకు

బాండ్లలో స్థిరమైన రాబడుల కోసం..

Monday 9th December 2019

ఐడీఎఫ్‌సీ బాండ్‌ ఫండ్‌ - మీడియం టర్మ్‌ ప్లాన్‌ ఆర్‌బీఐ ఇప్పటి వరకు 135 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించి, తాజా పాలసీలో యథాతథ స్థితికి మొగ్గు చూపించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు నియంత్రణ తప్పొచ్చన్న ఆందోళనలు, అంతర్జాతీయంగా అనిశ్చితి ఇవన్నీ దేశీయ బాండ్‌ మార్కెట్‌పై ప్రభావం చూపించేవే. కనుక ఈ రిస్క్‌లను అధిగమించేందుకు ఇన్వెస్టర్లు (తక్కువ నుంచి మోస్తరు రిస్క్‌ తీసుకునే వారు) షార్ట్‌, మీడియం

Most from this category