News


ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Friday 24th January 2020
Markets_main1579838833.png-31155

  • ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ 10 పాయింట్ల నష్టంతో 41,377 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు క్షీణించి 12,174 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. చైనాలో కరోనా వైరస్‌ ప్రబలుతోందన్న ఆందోళనలతో నేడు ఆసియాలో ప్రధాన మార్కెట్లు నష్టాలో ట్రేడ్‌ అవుతున్నాయి.  గురువారం రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలో గరిష్టస్థాయిని అందుకున్నప్పటికీ చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనంగా ప్రారంభం కావడంతో పాటు నేడు మార్కెట్‌కు ఈ వారం చివరి రోజు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తుండటం ప్రతికూలంగా మారింది. 

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 93.50 పాయింట్ల నష్టంతో 41,292.90 వద్ద, నిఫ్టీ 21.25 పాయింట్లు నష్టంతో 12,159.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌, ఐటీ, ప్రైవేట్‌ బ్యాంక్‌, ఆర్థిక రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌, రియల్టీ, ఫార్మా, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, అటో రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది.  ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో విక్రయాల కారణంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 46 పాయింట్ల నష్టంతో 31వేల దిగువున 30,977.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇన్ఫోసిస్‌, ఇన్ఫ్రాటెల్‌, కోటక్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు 1శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. బ్రిటానియా, ఐఓసీ, కోల్‌ ఇండియా, యూపీఎల్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్ల తగ్గింపు-కార్పొరేట్ల అంచనా

Friday 24th January 2020

రూ. 2.5 లక్షల పరిమితి పెంపు? కేపీఎంజీ సర్వే నివేదిక వెల్లడి వచ్చే నెల 1న లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను రేట్లలో కోత ఉండవచ్చని పారిశ్రామికవేత్తలు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూపొందిస్తున్న బడ్జెట్‌పై ట్యాక్స్‌ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో ఇంకా మరిన్ని ఆశలు, అంచనాలు వెలువడ్డాయి. వివరాలు చూద్దాం.. మినహాయింపుల పెంపు? ప్రస్తుతం అమలు చేస్తున్న రూ. 2.5 లక్షల

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించనున్న కొన్ని ప్రధాన కంపెనీలు

Friday 24th January 2020

ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఆవాస్‌ ఫైనాన్స్‌, అగ్రో టెక్‌(ఇండియా), ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌, అతుల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియా బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, మంగళం డగ్ర్స్‌ అండ్‌ ఆర్గానిక్స్‌, ఓరియంటల్‌ హోటల్స్‌, ప్రేస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌, టెక్‌ ఇండియా నిర్మన్‌ కంపెనీలు నేడు తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

Most from this category