News


ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Monday 17th June 2019
Markets_main1560743926.png-26330

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ 52 పాయింట్ల నష్టంతో 39,450 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లను కోల్పోయి 11813 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రేపటి నుంచి ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తుండంతోపాటు, పశ్చిమాసియాలో దేశాల్లో చెలరేగిన రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖంతో ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. క్రూడాయిల్‌ ధరలు చల్లారలేదు. ఇక దేశీయంగా చూసినట్లైతే... అమెరికా నుంచి దిగుమతయ్యే 29 వస్తువులపై భారత్‌ పెంచిన సుంకాలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో... సుంకాల పెంపుపై అమెరికా ప్రతిస్పందన కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు నేడు డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ప్రారంభం కావడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 130 పాయింట్లను కోల్పోయి 39,321.51 వద్ద, నిఫ్టీ  35.50 పాయింట్లను నష్టపోయి 11,787.80 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఫార్మా, ఐటీ తప్ప అన్నిరంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవుతున్నాయి.

రిలయన్స్‌, గ్రాసీం, వేదాంత, ఇండస్ఇండ్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 1.50శాతం నుంచి 2శాతం నష్టపోగా, యూపీఎల్‌, ఆసియన్‌ పేయింట్స్‌, భారతీఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు అరశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

ఫ్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Monday 17th June 2019

రూపీ డాలర్‌ మారకం‍తో 69.80 వద్ద  సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. డాలర్‌ బలపడడం, చమురు ధరల పెరగడంతో శుక్రవారం 30 పైసలు పెరిగి 69.80 వద్ద ముగిసింది. డాలర్‌ బలపడడంతో నేడు ఆసియా మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యె అవకాశం ఉంది.  ఈ వారంలో దేశియంగా ఎటువంటి ఆర్ధిక చర్యలు లేకపోవడంతో మారకంలో రూపీ విలువ తగ్గవచ్చు. డాలర్‌తో రూపాయి మారకం ఈ రోజు 69.40 నుంచి 70.05-70.20 పరిధిలో ఉండవచ్చని

పడినప్పుడు కొనుగోలు చేయడం: నర్నోలియా

Sunday 16th June 2019

నిఫ్టీ గత వారం 12,000-11,800 శ్రేణిలో ట్రేడవడంతోపాటు బార్‌ టైప్‌ క్యాండిల్‌ స్టిక్‌ ప్యాటర్న్‌ నమోదు చేసిందని, దీని ప్రకారం నిఫ్టీ దిగువ వైపున 11,770 స్థాయిని బ్రేక్‌ చేయకపోవచ్చని నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రీసెర్చ్‌ హెడ్‌ షబ్బీర్‌ ఖయ్యూమి తెలిపారు. 12,100పైన నిఫ్టీ క్లోజ్‌ అయితే తదుపరి 12,500 వరకు లక్ష్యంగా పేర్కొన్నారు. నిఫ్టీ 50డీఎంఏ 11,680 స్థాయిల పైన ట్రేడవుతోందని, మధ్యకాలానికి బలమైన

Most from this category