News


నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లోకి...

Tuesday 28th January 2020
Markets_main1580184529.png-31257

కరోనా వైరస్‌ కారణంగా ఈ కొత్త ఏడాదిలో రెండో రెండో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన దేశీయ మంగళవారం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 54 పాయింట్ల నష్టంతో 41,101 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 12100 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నప్పటికీ.., నిన్నటి రోజున మార్కెట్‌ భారీ పతనం నేపథ్యంలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడంతో సూచీలు తిరికి లాభాల్లోకి మళ్లాయి.  దీనికి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు వరసగా 6రోజూ నష్టాలతో ప్రారంభం కావడం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7పైసలు బలపడటం మార్కెట్‌కు కలిసొస్తుంది. 

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ మునుపటి ముంగిపు(41,155తో పోలిస్తే 150 పాయింట్ల లాభంతో 41305, నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 12,150 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అటో, ఆర్థిక, మీడియా, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ప్రైవేట్‌ రంగ, రియల్టీ,  మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. 

ఈక్విటీ మార్కెట్లలో కరోనా వైరస్‌ కల్లోలం కొనసాగుతోంది. చైనాలో పుట్టిన ప్రపంచదేశాల వణికిస్తున్న ఈ వైరస్‌ వ్యాధి భయాందోళనలు ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లను చుట్టుముట్టాయి. ఫలితంగా ఆసియా నుంచి అమెరికా మార్కెట్ల వరకు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. కరోనా వైరస్‌ భయాలతో నిన్నరాత్రి అమెరికా సూచీలు మూడు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాలు నేటి రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఆసియా జకర్తా ఇండెక్స్‌ 1శాతం, కోస్పి ఇండెక్స్‌ 3.50శాతం, స్ర్టయిట్‌ టైమ్స్‌ 2.50శాతం, జపాన్‌ నికాయ్‌ 1శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

స్వల్పకాలానికి టెక్నికల్‌ సిఫార్సులు

Tuesday 28th January 2020

కరోనా వైరస్‌ ఆందోళనల నుంచి దేశీ స్టాక్‌ మార్కెట్లు తేరుకున్నాయి. సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ 168 పాయింట్లు ఎగసి 41,322  వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సైతం 39 పాయింట్లు బలపడి 12,158 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ విశ్లేషకులు, సాంకేతిక నిపుణులు స్వల్ప కాలానికి కొన్ని స్టాక్స్‌ సిఫారసు చేస్తున్నారు. వివరాలు చూద్దాం.. కునాల్‌ బోత్రా, ఇండిపెండెంట్‌ మార్కెట్‌ నిపుణులు ఐషర్‌ మోటార్స్‌: ఈ స్టాక్‌ను

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణల్లో రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా!?

Tuesday 28th January 2020

ఆప్‌టెక్‌ షేర్ల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడారన్న ఆరోపణలకుగాను బిగ్‌బుల్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలాపై సెబి డేగకన్ను వేసింది. ఈ వ్యవహారంలో ఆప్‌టెక్‌ బోర్డుమెంబర్లైన రమేశ్‌ దమానీ, మధు జయకుమార్‌ తదితరుల పాత్రపై కూడా సెబి పరిశీలన జరపనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రశ్నించేందుకు ఈ నెల 24న రాకేశ్‌ను ఆయన భార్య రేఖను, సోదరుడు రాజేశ్‌ కుమార్‌ను, అత్త సుశీలాదేవీ గుప్తాను సెబి పిలిపించిందని ఎకనమిక్‌ టైమ్స్‌ తెలిపింది.

Most from this category