News


ఆరో రోజూ లాభాలే!

Friday 1st November 2019
Markets_main1572604140.png-29290

బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీల ర్యాలీ ఆరోరోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 36 పాయింట్ల లాభంతో 40,165 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11,890 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో 300(1శాతం)పాయింట్లు మేర లాభపడి 30,364.30 వద్ద స్థిరపడింది. నేడు పలు కంపెనీలు ప్రకటించిన అక్టోబర్‌ అమ్మక గణాంకాలు అంతంత మాత్రంగా ఉండటంతో అటో షేర్లు స్వల్పంగా తగ్గాయి. రూపాయి స్వల్పంగా బలపడటంతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. 
సూచీల సగం లాభాలు మాయం:- 
గత వరుస ఐదు సెషన్‌ల లాభాల ముగింపునుకు కొనసాగింపుగా నేడు సూచీలు పాజిటివ్‌గానే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఇన్వెస్టర్లు కోనుగోళ్లకు మొగ్గచూపడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 154 పాయింట్లు ఆర్జించి 40,283 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 11,899.50 స్థాయి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మిడ్‌సెషన్‌ నేడు వెలుబడిన అక్టోబర్‌ వాహన గణాంకాలు అంతంత మాత్రంగానే ఉండటం, అక్టోబర్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.1లక్ష కోట్లలోపు గానే నమోదు కావడం, నిన్న కేంద్రం ప్రకటించిన సెప్టెంబర్‌లో మౌలికరంగంలో 5.2శాతం క్షీణించడటం తదితర కారణాలతో నేడు వారంతపు రోజున కావడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర కారణాలతో మార్కెట్లో అమ్మకాలు పెరగడంతో సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్లో సగం వరకు మాయం అయ్యాయి.
జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటాస్టీల్‌, ఇండస్‌ఇండ్‌, ఇన్ఫ్రాటెల్‌, జీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు 4శాతం నుంచి 18.50శాతం వరకు లాభపడ్డాయి. ఐషర్‌మోటర్స్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, ఐఓసీ, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 6శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

క్యూ2 ఫలితాలు: రెండురెట్లు పెరిగిన డా. రెడ్డీస్‌ లాభం

Friday 1st November 2019

డా. రెడ్డీస్‌ లేబోరేటరీష్‌, శుక్రవారం ప్రకటించిన సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో రూ. 1,092.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 503.80 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 4,800.9 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 3,797.8 కోట్ల కంటే 26.41 శాతం అధికం కావడం గమనార్హం. ఈ త్రైమాసికంలో కంపెనీ

పెరిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికర లాభం

Friday 1st November 2019

   ఆర్థిక సంవత్సరం 2020 సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 266.4 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ప్రొవిజన్లు తగ్గడంతో పాటు, నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) పెరగడంతో  బ్యాంక్‌ నికర లాభం పెరిగింది. అంతేకాకుండా బ్యాంక్‌ ఇతర ఆదాయం, ప్రొవిజన్లకు ముందు ఆపరేటింగ్‌ లాభం పెరగడంతో కూడా బ్యాంక్‌ నికర లాభం పెరిగింది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంక్‌ రూ.

Most from this category