News


స్వల్ప లాభం మొదలైన మార్కెట్‌

Monday 17th February 2020
Markets_main1581912534.png-31842

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 66 పాయింట్ల లాభంతో 41,324.04 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 12,131.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాధి మరింత ఉధృతం కావడంతో పాటు, కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావంతో ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని ఐఎమ్‌ఎఫ్‌ ఎండీ అభిప్రాయపడంతో నేడు ఆసియా మార్కెట్లు మూడువారాల గరిష్టం నుంచి దిగివచ్చాయి. అంతర్జాతీయ వృద్ధి భయాలతో ముడిచమురు ధరలు దిగివచ్చాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ముగింపు(71.36)తో 7పైసలు బలహీనపడి 71.43 వద్ద ప్రారంభమైంది. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 56.90 పాయింట్ల నష్టంతో 41,200 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లను నష్టపోయి 12,092.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ షేర్లు నష్టపోతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు టెలికాం కంపెనీలు నేడు టెలికం శాఖకు కొంత మొత్తం బకాయిలు చెల్లించనున్న టెలికాం రంగ షేర్లు లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వోడాఫోన్‌ ఐడియా 10శాతం, ఎయిర్‌టెల్‌ అరశాతం నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారభించాయి.

బజాజ్‌ అటో, కోల్‌ ఇండియా, సిప్లా, ఓఎన్‌జీసీ, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 4శాతం నష్టపోయాయి. టైటాన్‌, ఇండస్‌ ఇండ్‌బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, గెయిల్‌, టీసీఎస్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డ్డాయి. 



You may be interested

ఎయిర్‌టెల్‌లో ఎఫ్‌అండ్‌ఓ వ్యూహం!

Monday 17th February 2020

రిస్కు తీసుకునే ట్రేడర్లు ఎయిర్‌టెల్‌ షేరులో బుల్‌ కాల్‌ ల్యాడర్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శుక్రవారం ఏజీఆర్‌ తీర్పుఅనంతరం ఎయిర్‌టెల్‌ షేరు ఆల్‌టైమ్‌ హైకి చేరింది. కోర్టు తీర్పు ప్రకారం బకాయిల చెల్లింపునకు ఎయిర్‌టెల్‌ నిధులు సమీకరించిందన్న వార్తలు షేరులో జోరు పెంచాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ కౌంటర్లో బుల్‌ కాల్‌ ల్యాడర్‌ వ్యూహం బెటరని నిపుణుల సూచన.  ఈ వ్యూహంలో.. ఎయిర్‌టెల్‌ 560స్ట్రైక్‌ప్రైస్‌ వద్ద ఒక లాట్‌ కాల్‌ కొనుగోలు

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు తగ్గిన పెట్టుబడులు

Monday 17th February 2020

డిసెంబర్‌ క్వార్టర్‌లో 12,000 కోట్ల రాక న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక డిసెంబర్‌ త్రైమాసికంలో నెమ్మదించింది. మార్నింగ్‌స్టార్‌ నివేదిక ప్రకారం.. 2019 జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.23,874 కోట్ల పెట్టుబడులు రాగా, 2019 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.11,837 కోట్లుగానే ఉన్నాయి. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్‌ క్వార్టర్‌లో అన్ని రకాల ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టబడుల రాక తగ్గింది. ఇక 2019 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో

Most from this category