News


ఐఎంఎఫ్‌ నెగిటివ్‌ అవుట్‌లుక్‌ : నష్టాలతో మొదలైన మార్కెట్‌

Tuesday 21st January 2020
Markets_main1579579656.png-31065

  • 12200 దిగువున మొదలైన నిఫ్టీ

భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించడంతో దేశీయ మార్కెట్‌ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 42 పాయింట్లు నష్టంతో 41,487 వద్ద మెదలైంది. నిఫ్టీ 29 పాయింట్ల క్షీణతతో 12200 దిగువున 12,195 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ నష్టాల ప్రారంభం కావడం గమనార్హం. భారత్‌లో గ్రామీణ డిమాండ్‌ వృద్ధి పడిపోయిందని, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి మందగమన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020)లో భారత్‌ ఆర్థికవృద్ధి  4.8 శాతమే నమోదవుతుందని ఐఎంఎఫ్‌ సోమవారం ప్రకటించింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సైతం నెగిటివ్‌ అవుట్‌లుక్‌ కేటాయించింది. ఫలితంగా అటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్‌ బలహీనపడింది. నేడు అంతర్జాతీయంగా ముడిచమురు బలపడటం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనంగా కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఉదయం గం.9:20నిల.కు సెన్సెక్స్‌ 134.54 పాయింట్ల నష్టంతో 41,394.37 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు పతనమైన 12,195.60 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి ప్రభుత్వరంగ బ్యాంకులు, మీడియా షేర్లకు మాత్రమే కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అత్యధికంగా మెటల్‌, అటో, ఫార్మా షేర్లు నష్టపోతున్నాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31వేల దిగువన ట్రేడ్‌ అవుతోంది. 


నిఫ్టీ-50 ఇండెక్స్‌లో .... కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, హీరోమోటోకార్ప్‌, యూపీఎల్‌ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోల్‌ ఇండియా, జీ లిమిటెడ్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు అరశాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

ప్రమోటర్లు వాటా పెంచుకున్న చిన్న షేర్లు!

Tuesday 21st January 2020

జాబితాలో రేమండ్‌ లిమిటెడ్‌ గ్రీవ్స్‌ కాటన్‌, శాస్కన్‌ టెక్నాలజీస్‌ వోల్టాం‍ప్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, బేయర్‌ క్రాప్‌సైన్స్‌ మార్కెట్లు అంతగా దృష్టిపెట్టని కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలలో గత కొంత కాలంగా ప్రమోటర్లు వాటాలు పెంచుకుంటూ వస్తున్నారు. ఈ జాబితాలో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రేమండ్‌ లిమిటెడ్‌, ఐటీ సేవల శాస్కన్‌ టెక్నాలజీస్‌, విద్యుత్‌ రంగ కంపెనీ వోల్టాం‍ప్ ట్రాన్స్‌ఫార్మర్‌, అగ్రికెమికల్స్‌ దిగ్గజం బేయర్‌ క్రాప్‌సైన్స్‌, ఇంజిన్ల తయారీ కంపెనీ గ్రీవ్స్‌ కాటన్‌ చోటు సాధించాయి. సాధారణంగా

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Tuesday 21st January 2020

జీ ఎంటర్‌టైన్మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ,  హావెల్స్‌ ఇండియా, పాలీక్యాబ్‌ ఇండియా, న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, తేజాస్‌ నెట్‌వర్క్స్‌, గుజరాత్‌ ఇన్వెస్టా కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్నాయి. 

Most from this category