News


సెన్సెక్స్‌, నిఫ్టీ రికార్డు ముగింపు

Monday 13th January 2020
Markets_main1578911035.png-30894

ఇంట్రాడేలో 41,900 సమీపానికి సెన్సెక్స్‌
12,338 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ప్లస్‌లోనే

ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉపశమించడంతోపాటు.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్న అంచనాలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం‍ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలి సెషన్‌లోనే అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. తొలుత 41,900 సమీపానికి చేరడం ద్వారా సెన్సెక్స్‌, 12,338కు చేరడం ద్వారా నిఫ్టీ సరికొత్త ఇంట్రాడే రికార్డులను సాధించాయి. చివరికి సెన్సెక్స్‌ 260 పాయింట్లు జంప్‌చేసి 41,860 వద్ద నిలవగా.. నిఫ్టీ 73 పాయింట్లు ఎగసి 12,330 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,721 దిగువన, నిఫ్టీ 12,286 వద్ద కనిష్టాలకు చేరాయి.

రియల్టీ, ఐటీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, ఐటీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌, కోల్‌ ఇండియా, గెయిల్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌ 5-1.5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో యస్‌ బ్యాంక్‌ 6 శాతం పతనంకాగా.. ఇన్ఫ్రాటెల్‌, యూపీఎల్‌, టీసీఎస్‌, ఐషర్‌, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌, ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ 1.2-0.5 శాతం మధ్య నీరసించాయి.

ఫైనాన్స్‌ షేర్లు అప్‌
డెరివేటివ్స్‌లో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, టాటా గ్లోబల్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, నిట్‌ టెక్‌, మణప్పురం, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ 4-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క పేజ్‌ ఇండస్ట్రీస్‌, డిష్‌ టీవీ, మదర్‌సన్‌ సుమీ, పీవీఆర్‌, సన్‌ టీవీ, లుపిన్‌, ఎంఆర్‌ఎఫ్‌ 2.4-1 శాతం వెనకడుగు వేశాయి. ఇక రియల్టీ కౌంటర్లలో శోభా, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌ 6-3 శాతం మధ్య పురోగమించాయి. కాగా.. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.8 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1544 లాభపడగా.. 984 మాత్రమే నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 578 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 252 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 431 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 419 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.You may be interested

అనలిస్టుల నుంచి టాప్‌ 12 సిఫార్సులు

Monday 13th January 2020

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడులు అందించే సత్తా ఉన్న 12 స్టాకులను వివిధ అనలిస్టులు అందిస్తున్నారు.  శ్రీకాంత్‌ చౌహాన్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌. 1. హెచ్‌యూఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2060. స్టాప్‌లాస్‌ రూ. 1900. గతర్యాలీ అనంతర రిట్రేస్‌మెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కీలక రిట్రేస్‌మెంట్‌ జోన్‌ నుంచి షేరు బలంగా రివర్సయింది. దీన్నిబట్టి షేరులో కరెక‌్షన్‌ ముగిసిందని భావించవచ్చు. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పరచడం ద్వారా మరింత

టాటా ఎలక్సీ, ఆశాపురా, హడ్కో..జూమ్‌

Monday 13th January 2020

సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త రికార్డ్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉపశమించడంతోపాటు.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్న అంచనాలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం‍ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలి సెషన్‌లోనే అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. మధ్యాహ్నం 2.40 సమయంలో సెన్సెక్స్‌ 227 పాయింట్లు జంప్‌చేసి 41,826కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు ఎగసి 12,320 వద్ద ట్రేడవుతోంది. తొలుత

Most from this category