News


11450 పైన ముగిసిన నిఫ్టీ

Wednesday 16th October 2019
Markets_main1571221844.png-28929

  • నాలుగో రోజూ లాభాల ముగింపే

ఆర్థిక, ఇంధన, ఐటీ షేర్ల ర్యాలీతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో బుధవారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంతో 38,599 వద్ద ముగిసింది, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 11450 పైన 11,471 వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్‌, మెటల్‌, అటో షేర్లు ఎఫ్‌ఎంజీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 12 పాయింట్ల స్వల్ప నష్టంతో 28,543.40 వద్ద స్థిరపడింది. గత మూడు రోజుల లాభాల ముగింపు కొనసాగింపుగా నేడు సూచీలు పాజిటివ్‌గానే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్ల ఆస్తకి చూపడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 160 పాయింట్ల వరకు లాభపడి 38,666 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 11,481.05 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు మొదలవడంతో సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. అయితే మార్కెట్‌ చివరి అరగంటలో ఇదే బ్యాంకింగ్‌ రంగ షేర్లలో రికవరీ కావడంతో సూచీలు మళ్లీ లాభాల పట్టాయి. ‘‘నిఫ్టీ 11050 వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. అప్‌ట్రెండ్‌ కొనసాగితే రానున్న రోజుల్లో 11700 స్థాయికి చేరకుంటుంది. రానున్న రోజుల్లో ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఐటీ కంపెనీ షేర్లు రాణించే అవకాశం ఉంది. అయితే ఎంచుకోబడిన మిడ్‌క్యాప్‌ షేర్లు మాత్రమే కొనుగోళ్లు చేయడం ఉత్తమం’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ సాహజ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు.

ఓఎన్‌జీసీ, గ్రాసీం, జీ లిమిటెడ్‌, బజాజ్‌ఫైనాన్స్‌, బీపీసీఎల్‌ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పేయింట్స్‌, హిందాల్కో, వేదాంత, హీరోమోటోకార్ప్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

పడిపోతున్నా కానీ ఈ స్టాక్స్‌లో ఫండ్స్‌ పెట్టుబడులు

Wednesday 16th October 2019

పడిపోతున్న చాకును పట్టుకోవద్దన్న సూక్తి స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టుల నుంచి వినిపిస్తుంటుంది. అయితే, ఈ సూత్రం అన్నింటికీ వర్తించదులేండి. ఎందుకంటే కొన్ని మంచి కంపెనీల షేర్లు కూడా తాత్కాలిక ప్రతికూలతల కారణంగా పడిపోతుంటాయి. అవి కొనుగోళ్లకు మంచి అవకాశాలుగానే చూడాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా మంచి పెట్టుబడి అవకాశాలుగా భావించి... గత ఏడాదిగా పడిపోతున్నప్పటికీ ఓ ఎనిమిది కంపెనీలలో క్రమంగా వాటాలు పెంచుకుంటూ వస్తున్నాయి.    ఇలా మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటాలు క్రమంగా

ఆచితూచి వ్యవహరిస్తున్న ఎఫ్‌పీఐలు!

Wednesday 16th October 2019

టాక్స్‌ తగ్గింపు ప్రభావం చూపుతుంది మార్కెట్‌ నిపుణుడు సమీర్‌ నారాయణ్‌ పతనం పూర్తయిందని భావించిన కౌంటర్లను జాగ్రత్తగా ఎంచుకొని విదేశీ ఫండ్స్‌ పెట్టుబడులు పెడుతున్నాయని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు సమీర్‌ నారాయణ్‌ అభిప్రాయపడ్డారు. స్వల్పకాలానికి ఎర్నింగ్స్‌ వృద్ధి కన్నా పన్నుల తగ్గింపే ఎక్కువ ప్రభావం చూపుతుందని భావించే షేర్లను ఎంచుకుంటున్నాయన్నారు. ఎంపిక చేసిన కంపెనీలకు కార్పొరేట్‌ పన్ను తగ్గింపు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుందని ఎఫ్‌ఐఐలు భావిస్తున్నాయన్నారు. త్రైమాసిక ఫలితాల ఆధారంగా విదేశీ మదుపరులు

Most from this category