నాలుగో రోజూ నష్టాలే..!
By Sakshi

మెటల్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌కు నాలుగో రోజూ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 198 పాయింట్ల పతనమై 38,107 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 11,313 వద్ద స్థిరపడింది. ఆర్థిక మందగమన భయాలతో ప్రపంచ మార్కెట్లల్లో నెలకొన్న అస్థిరత, నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత, ఇటీవల అమెరికా, యూరప్‌లలో విడుదలైన బలహీన ఆర్థిక గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రేడింగ్ ఆద్యంతం అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ఇంట్రాడేలో ఒకదశలో నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 11,257 వద్ద, సెన్సెక్స్ 350 పాయింట్ల మేర క్షీణించి 37,957.56 వద్ద కనిష్టాలను నమోదు చేశాయి. అత్యధికంగా మెటల్ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనమయ్యాయి. బ్యాంకింగ్ రంగ షేర్ల పతనం వరుసగా ఐదోరోజూ విక్రయాలు కొనసాగడంతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 307(1.09శాతం) పాయింట్లు నష్టపోయి 28,418.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అరశాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈలో 150 షేర్లు ఏడాది కనిష్ట స్థాయిని తాకాయి. మరోవైపు దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా వాహన విక్రయాలు పుంజుకోవచ్చనే ఆశాభావాన్ని అటోరంగ షేర్లకు, జీ లిమిటెడ్ షేర్ల ర్యాలీ ప్రభావంతో మీడియా రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది.
ఇండస్ఇండ్ బ్యాంక్. టాటా స్టీల్, కోల్ ఇండియా, హిందాల్కో, వేదాంత లిమిటెడ్ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం వరకు నష్టపోయాయి. ఐఓసీ, టాటా మోటర్స్, జీ లిమిటెడ్, బీపీసీఎల్, యస్‌బ్యాంక్ షేర్లు 3శాతం నుంచి 33.50శాతం లాభపడ్డాయి.
You may be interested
లార్జ్‌క్యాప్ స్టాక్స్ ర్యాలీ ఇప్పుడే మొదలైంది..!
Friday 4th October 2019బీఎస్ఈ 100లోని స్టాక్స్‌లో నాలుగింట మూడొంతులు సెప్టెంబర్‌లో పెరిగాయి. వరుసగా మూడు నెలల నష్టాలకు గత నెలలో తెరపడింది. కార్పొరేట్ పన్ను తగ్గింపు దలాస్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందనడంలో సందేహం లేదు. ఎక్కువగా షార్ట్ కవరింగ్ జరిగింది. బీఎస్ఈ100లోని 22 స్టాక్స్ డబుల్ డిజిట్ స్థాయిలో పెరిగాయి. బీపీసీఎల్, సీమెన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండియన్ ఆయిల్, టీవీఎస్ మోటార్, పేజ్ ఇండస్ట్రీస్ అధికంగా పెరిగిన వాటిల్లో
ఆసియాలో ఇండియా, మలేషియా మార్కెట్లే ఖరిదైనవి!
Thursday 3rd October 2019ఆసియా ఈక్విటీ మార్కెట్లలో ఇండియా, మలేషియా ఈక్విటీ మార్కెట్లు చాలా ఖరీదుగా ట్రేడవుతున్నాయని రెఫినిటివ్ ఓ నివేదికలో పేర్కొంది. యుఎస్-చైనా ట్రేడ్‌వార్ కొంత సరళతరం అవ్వడంతో పాటు, ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంతో గత నెల కాలంలో చాలా వరకు ఇతర ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయని ఈ కంపెనీ తెలిపింది. దేశీయ మౌలిక రంగాన్ని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం