News


11,900 దిగువకు నిఫ్టీ

Friday 22nd November 2019
Markets_main1574408011.png-29785

స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు... శుక్రవారం మిడ్‌సెషన్‌ కల్లా భారీగా నష్టాల్లోకి మళ్లాయి. ఐటీ రంగ షేర్ల పతనంతో పాటు సూచీల గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం సూచీల పతనానికి కారణమవుతున్నాయి. అలాగే ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకానమీ కో అపరేషన్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌(ఓఈసీడీ) సంస్థ ఈ ఏడాదికి దేశీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను 5.8శాతానికి డౌన్‌గ్రేడ్‌ చేయడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఒక్క మెటల్‌, మీడియా షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఒకదశలో సెన్సెక్స్‌ 279 పాయింట్లు నష్టపోయి 40,295.17 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో 11,884.45 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఐటీ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని  ఎదుర్కోంటున్నాయి. గోల్డ్‌మెన్‌ శాక్స్‌ ఐటీ కంపెనీ షేర్లైన టీసీఎస్‌, విప్రో, ఎంఫసీస్‌పై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమవుతోంది. మధ్యాహ్నం గం.12:30ని.లకు సెన్సెక్స్‌ 216 పాయింట్లు నష్టపోయి 40,358 వద్ద, నిఫ్టీ 63 పాయింట్ల నష్టంతో 11,905.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రైవేట్‌రంగ షేర్లలో అమ్మకాల కారణంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 31,166.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో భారీ పతనాన్ని చవిచూసిన మెటల్‌ షేర్లకు నేడు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో నష్టాల మార్కెట్లోనూ మెటల్‌ షేర్లు రాణిస్తున్నాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది.

ఇదే సమయానికి నిఫ్టీ-50 సూచీల్లో ....
టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2శాతం నుంచి 5.50శాతం వరకు నష్టపోయాయి. ఓఎన్‌జీసీ, పవర్‌ గ్రిడ్‌, యస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, జీ లిమిటెడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 4శాతం వరకు లాభపడింది. You may be interested

రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌తో ఐటీ షేర్లలో అమ్మకాలు..!

Friday 22nd November 2019

ప్రముఖ రేటింగ్‌ సంస్థ గోల్డ్‌మెన్‌ శాష్యూ ఐటీ రంగంపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో శుక్రవారం ఈ రంగానికి చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. దేశీయ ఐటీ రంగం రానున్న రోజుల్లో  చక్రీయ అవరోదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఐటీ రంగ వాల్యూవేషన్‌ చారిత్రాత్మక సగటు కంటే ప్రీమియం స్థాయిలో ఉన్నట్లు రేటింగ్‌ సంస్థ తన నివేదికలో తెలిపింది. వ్యవస్థలో చక్రీయ మందగమనం ప్రభావం కారణంగా ఆయా ఆయా

రెండు దశల్లో బీపీసీఎల్‌ వాటాల విక్రయం!

Friday 22nd November 2019

అమ్మకానికి ముందు జేవీల నుంచి ఎగ్జిట్‌ యోచన రిటైలింగ్‌, రిఫైనింగ్‌ వ్యాపారాల డీమెర్జర్‌ ఆలోచన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న ప్రభుత్వం బీపీసీఎల్‌ వాటా విక్రయానికి ఎక్కువమంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యూహం అవలంబించనుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ నుంచి కొన్ని అసెట్స్‌ను వేరు చేయడం(కంపెనీ వ్యాపారాలను డీమెర్జ్‌ చేయడం లేదా జాయింట్‌ వెంచర్ల నుంచి బయటకు రావడం), షేర్ల విక్రయాన్ని దశలవారీగా పూర్తి చేయడమనే వ్యూహాన్ని ప్రభుత్వం పాటించనుందని తెలిసింది. ఇందులో

Most from this category