News


అమ్మకాల ఒత్తిడిలో ఆటో షేర్లు

Monday 4th November 2019
Markets_main1572853171.png-29332

మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోయింది. మెటల్‌ ఐటీ షేర్ల ర్యాలీతో ఉదయం సెషన్‌లో సెన్సెక్స్‌ సెనెక్స్‌ 318 పాయింట్లును, నిఫ్టీ 99 పాయింట్లను ఆర్జించిన సంగతి తెలిసిందే. మార్కెట్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్న ఆటో రంగ షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికి సూచీల లాభాల్ని హరించివేశాయి. ఎన్‌ఎస్‌ఈలో ఆటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.50శాతం శాతం నష్టపోయింది. గతవారం మార్కెట్‌ చివరి రోజైన శుక్రవారం పలు ఆటో రంగ కంపెనీలు అక్టోబర్‌ వాహన విక్రయాల గణాంకాలను వెల్లడించాయి. పండుగ సీజన్‌ కారణంగా అమ్మకాలు కొంత పెరిగినప్పటికీ., మార్కెట్‌ అంచనాలకు అందుకోవడంలో విఫలమయ్యాయి. ఫలితంగా నేడు ఆయా ఆయా ఆటో కంపెనీల షేర్లను అమ్మేందుకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఈ రంగంలో ప్రధాన ప్రధాన షేర్లైన మారుతి సుజుకీ ఇండియా, హీరోమోటో కార్ప్‌ లిమిటెడ్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌, ఐషర్‌ మోటర్స్‌ లిమిటెడ్‌, టాటా మోటర్స్‌ లిమిటెడ్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(8,392.90)తో పోలిస్తే 1.25శాతం నష్టంతో 8,285.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

మళ్లీ రూ. 40 స్థాయికి యస్‌బ్యాంక్‌??

Monday 4th November 2019

బ్రోకరేజ్‌ల అంచనాలు తాజాగా యస్‌బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ప్రకటించిన మూలధన సమీకరణతో బ్యాంకు షేరు మరోమారు రూ. 40 స్థాయిలకు దిగివస్తుందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు తాజా ఫలితాల్లో ఏమాత్రం మెరుగుదల చూపలేదు. దీంతో బ్యాంకుపై ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న పాజిటివ్‌ ధృక్పధం కరుగుతున్న సూచనలు కనిపించాయి. తాజాగా ప్రకటించిన మూలధన సమీకరణలో భాగంగా బ్యాంకు ఈక్విటీలో దాదాపు 30 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉందని, ఇందుకు

రాణిస్తున్న ప్రభుత్వరంగ షేర్లు

Monday 4th November 2019

మార్కెట్‌కు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతలో భాగంగా సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రభుత్వరంగ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2శాతానికి పైగా లాభపడింది. నేడు ఇండెక్స్‌ 2,558.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం లాభపడింది. ఇండియన్‌ బ్యాంక్‌ 3శాతం, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌

Most from this category