News


స్వల్ప నష్టాలతో ముగింపు

Monday 16th December 2019
Markets_main1576493243.png-30253

ఇంట్రాడే కొత్త ఆల్‌టైం హైని అందుకున్న సెన్సెక్స్‌ 
12100 స్థాయిని చేజార్చుకున్న నిఫ్టీ 
ఐటీసీ, మెటల్‌, అటో షేర్లలో అమ్మకాలు 

ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలమయ్యాయి. ట్రేడింగ్‌లో ప్రారంభంలో సెన్సెక్స్‌ కొత్త రికార్డు గరిష్టాన్ని నమోదు చేసినప్పటికీ.., మార్కెట్ ముగిసే సరికి 71 పాయింట్లు నష్టపోయి 40938 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 12100 స్థాయిని చేజార్చుకొని 32.70 పాయింట్లు నష్టంతో 12054 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఎఫ్‌ఎంసీజీ, అటో, మెటల్‌ రంగాలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. ఫలితంగా మార్కెట్‌ ముగిసే సరికి నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయింది. అలాగే మిడ్‌సెషన్‌ అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో విక్రయాలు నెలకొనడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 32000 స్థాయి దిగువన 31,997 వద్ద స్థిరపడింది. డిసెంబర్‌ 18న(గురువారం) జీఎస్‌టీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఎఫ్‌ఎంజీసీ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. మరోవైపు రూపాయి బలపడటంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. వాటితో పాటు ఆర్థిక, రియల్టీరంగ షేర్లకు సైతం స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో నేడు సూచీలు భారీ లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 176 పాయింట్లు పెరిగి  41,185.03  కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 44 పాయింట్లు లాభంతో 12,134 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్లో అమ్మకాలు నెలకొనడంతో సూచీలు ఆరంభలాభాల్ని కోల్పోవడంతో పాటు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(41,185) నుంచి 246 పాయింట్లను, నిఫ్టీ ఇంట్రాడే హై(12,134.65) నుంచి నుంచి 74 పాయింట్లను కోల్పోయింది. 

జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఐషర్‌మోటర్స్‌, ఐటీసీ, అదానీ పోర్ట్స్‌, గ్రాసీం షేర్లు 2శాతం నుంచి 2.50శాతం వరకు నష్టపోయాయి. కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌ షేర్లు 1శాతం నుంచి 3శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

ఐదు స్టాక్‌ సిఫారసులు

Tuesday 17th December 2019

ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి, క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ 3 నుంచి 5 వారాల కోసం కొన్ని స్టాక్స్‌ను సూచించారు.    హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫారసులు ఎన్‌ఎండీసీ టార్గెట్‌ రూ.127. స్టాప్‌లాస్‌ రూ.103. రోజువారీ, వారం చార్ట్‌లు స్థిరమైన ర్యాలీకి సంకేతం ఇస్తున్నాయి. కీలకమైన నిరోధం రూ.115-117ను అధిగమించేందుకు సమీపంలో ఉంది. గత కొన్ని నెలల కాలంలో ఇది కీలక అవరోధంగా

మిడ్‌టర్మ్‌కు డాషింగ్‌ డజన్‌ సిఫార్సులు

Monday 16th December 2019

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినిచ్చే 12 షేర్లను వివిధ బ్రోకరేజ్‌లకు చెందిన అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. 1. కంటైనర్‌ కార్పొరేషన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 610. స్టాప్‌లాస్‌ రూ. 560. రికార్డు హై నుంచి వెనుదిరిగి వంద రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందింది. ఇక్కడ దాదాపు మూడు వారాలు కన్సాలిడేషన్‌ చెంది తాజా అప్‌మూవ్‌కు సిద్ధమైంది.  2. ఎల్‌అండ్‌టీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1355. స్టాప్‌లాస్‌ రూ. 1280. టాప్‌

Most from this category