News


41వేల పైన ముగిసిన సెన్సెక్స్‌

Friday 13th December 2019
Markets_main1576233720.png-30214

115 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 
కలిసొచ్చిన అంతర్జాతీయ అంశాలు
రాణించిన మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లు

అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో మార్కెట్‌ శుక్రవారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 428 పాయింట్లు పెరిగి 41వేల పైన 41,010 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 115 పాయింట్లను ఆర్జించి 12,087 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండున్నర నెలల గరిష్టానికి బలపడటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది.  అమెరికా చైనాల మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు వార్తలు వెలుగులోకి రావడంతో పాటు బ్రిటన్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ మరోసారి అధికారాన్ని చేపట్టడంతో అటు ఆసియా మార్కెట్లు 8నెలల గరిష్టస్థాయిలో ముగిశాయి. అలాగే నేడు యూరప్‌ మార్కెట్లు లాభాల ప్రారంభంతో పాటు అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో కదులుతుండటం మన మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు ఉత్సాహనిచ్చాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అన్ని రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల వెల్లువలా సాగాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల ర్యాలీ సూచీలు భారీ లాభాల్ని అర్జించేందుకు దోహదపడ్డాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 474 పాయింట్లు పెరిగి 41,055 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 12,098.85 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1శాతం పెరిగాయి. 

మారుతి, ఎస్‌బీఐ, హిందాల్కో, వేదాంత, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 4శాతం వరకు లాభపడ్డాయి. యూపీఎల్‌, కోటక్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, భారతీఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 1శాతం నుంచి 2.75శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

నిఫ్టీ బ్యాంకు ర్యాలీకి కారణాలివే..

Friday 13th December 2019

శుక్రవారం ప్రభుత్వరంగ బ్యాంకులు టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. ఎస్సార్‌ స్టీల్‌ దివాలా పరిష్కార కేసులో బ్యాంకులకు చెల్లింపులు ఈ నెలలోనే ఉంటాయన్న వార్తలు ర్యాలీకి కారణమయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ ఏకంగా 3.66 శాతం పెరిగి 2,561.60కు చేరుకుంది. నిఫ్టీ బ్యాంకు సూచీ కూడా కీలకమైన 32,000 మార్క్‌పైకి చేరింది. యూనియన్‌బ్యాంకు, ఓబీసీ, కెనరా బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, పీఎన్‌బీ, బ్యాంకు

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

Friday 13th December 2019

యూనియన్‌ బడ్జెట్‌ 2020-21 ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్నట్లు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లద్‌ జోషీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేసీ సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికిది రెండో బడ్జెట్‌ కానుంది. వాస్తవానికి ఫిబ్రవరి 1 శనివారం మార్కెట్లకు సెలవు. అయినప్పటికీ ఇదే రోజున కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 

Most from this category