News


స్వల్ప నష్టంతో ముగింపు

Thursday 21st November 2019
Markets_main1574332390.png-29764

సూచీల రెండురోజుల వరుస లాభాల ముగింపునకు గురువారం బ్రేక్‌ పడింది. ఇంట్రాడే ఆద్యంతం పరిమితి శ్రేణిలో ట్రేడైన సూచీలు చివరి అరగంటలో అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ 76 పాయింట్ల నష్టంతో 40,575 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్లను కోల్పోయి 11,968 వద్ద ముగిసింది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం అంశంపై సరైన స్పష్టత కోసం ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 3 పాయింట్ల నష్టంతో 31,350 వద్ద స్థిరపడింది.మెటల్‌ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అటో, ఫార్మా, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ ఐటీ షేర్లు సైతం నష్టపోయాయి. అయితే, మీడియా, రియల్టీ, ఆర్థిక రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 40,745 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. 40,534 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. నిఫ్టీ ఇండెక్స్‌ 11,957- 12,028 రేం‍జ్‌లో కదలాడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 5రోజుల వరుసగా లాభాల ముగింపునకు, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3రోజుల వరుస లాభాలకు నేడు ముగింపు పడింది. 
భారతీ ఎయిర్‌టెల్‌, యస్‌బ్యాంక్‌, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌ షేర్లు 2.50శాతం నుంచి 6శాతం నష్టపోయాయి. హిందూస్థాన్‌ యూనీలివర్‌, అదానీ పోర్ట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఐషర్‌ మోటర్స్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1.5 శాతం- 12శాతం మధ్యలో లాభపడ్డాయి. 



You may be interested

తప్పుడు మెసేజ్‌లతో జాగ్రత్త..పేటీఎం చీఫ్‌

Thursday 21st November 2019

కంపెనీ అధికారుల్లాగా మోసగాళ్లు పంపే నకిలీ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ కస్టమర్లకు సూచించారు. పేటీఎం అకౌంట్‌ బ్లాక్‌ చేశామని, కేవైసీ(నో యువర్‌ కస్టమర్‌)ని చేయమని వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దని సోషల్‌ మీడియాలో ఆయన కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. అలా వచ్చే ఒక శాంపిల్‌ నకిలీ మెసేజ్‌ను సైతం ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘ మీ పేటీఎం అకౌంట్‌ను కొంత

డిసెంబర్‌లో డెట్‌ ఈటీఎఫ్‌!

Thursday 21st November 2019

కేంద్ర ప్రభుత్వం స్థిరంగా ఆదాయాన్నిచ్చే ఈటీఎఫ్‌(ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)ను ఈ డిసెంబర్‌లో ప్రారంభించనుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఈటీఎఫ్‌ పరిమాణం రూ. 15,000-20,000 కోట్లుగా ఉంటుందని, ఇందులో డెట్‌ సెక్యురిటీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు ఉంటాయని వివరించారు. ‘పీఎస్‌యూ(ప్రభుత్వం రంగ సం‍స్థలు)లకు చెందిన ఏఏఏ రేటింగ్‌ పత్రాలను మాత్రమే ఈ ఫండ్‌ కలిగివుంటుంది. అంతేకాకుండా ఈ ఫండ్‌ ఏడు శాతం రిటర్న్‌ను ఆఫర్‌ చేస్తుంది. ఇది పన్ను రేటు తగ్గిన

Most from this category